పెద్ద తుంబళం మరో అయోధ్య

పెద్ద తుంబళం మరో అయోధ్య

ఆదోని రూరల్‌/అర్బన్‌: పెద్ద తుంబళంలోని పురాతన రామాలయాన్ని అభివృద్ధి చేస్తే మరో అయోధ్యగా ప్రఖ్యాతి చెందుతుందని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్ద తుంబళం గ్రామాన్ని సందర్శించి అక్కడి పురాతన రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ 800 ఏళ్ల క్రితం నాటి దేవాలయం ఇప్పటికి పటిష్టంగా ఉండటం విశేషమన్నారు. మాన్యం భూముల ద్వారా ఆదాయం వస్తున్నా ఆయలం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో ఇటీవలే మాట్లాడి రూ. కోటితో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను పూనుకున్నట్లు చెప్పారు. అనంతరం అదే గ్రామంలోని జైన్‌ దేవాలయాన్ని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌ౖజైన్‌  సంప్రదాయబద్దంగా స్వామికి శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త విట్టారమేష్‌, విశ్వ హిందూ పరిషత్‌ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. 

 

 

రామరాజ్యం రావాలంటే గురువులే రావాలి

రామరాజ్యం రావాలంటే రాజకీయ నాయకులచేత రాదని, గురువులొస్తేనే రామరాజ్యం వస్తుందని పరిపూర్ణానందస్వామి అన్నారు. సోమవారం పట్టణంలోని భవసాగర కల్యాణ మండపంలో పురప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంపై ఎందరో దాడులు చేసినా దేశ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నది గురువులేన్నారు.  రామమందిరం నిర్మాణం చేయాలంటే రామనామంతో పాటు, కార్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖులు విట్టా కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, విట్టా రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, మారుతీరావు, ప్రకాష్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు.   

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top