పెద్దపల్లి టు కోనసీమ

పెద్దపల్లి టు కోనసీమ


► పెద్ద సంఖ్యలో తరలుతున్న పుంజులు          

►పందెం కోళ్లకు అక్కడ మంచి డిమాండ్‌

►జిల్లాలో విరివిగా పెంపకం




పెద్దపల్లి : కోడి పందేలపై జిల్లా ప్రజలకు పెద్దగా ఆసక్తి లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో పందెం కోళ్లు మా త్రం విరివిగా పెంచుతున్నారు. వీటిని కోనసీమ జిల్లాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంతోపాటు కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, ధర్మా రం మండలాల్లోని పలు గ్రామాల్లో నాటుకోళ్లు పెంచుతున్నవారు పందెం కోళ్లనూ పెంచుతున్నారు. గతంలో ఇక్కడ పెంచిన పందెం కోళ్లను సంక్రాంతి సందర్భం గా శివపల్లి, బెల్లంపల్లి, చందోలి, శ్రీరాంపూర్‌లోసాగే పందేలకు తీసుకెళ్లేవారు. రెండేళ్లుగా ఈ ప్రాం తంలో పందేలపై నిషేధం విధించారు. అయినా పందెం కోళ్ల పెంపకం మాత్రం నిరాటంకంగానే కొనసాగుతోంది. నాటుకోళ్లు(పెరటికోళ్లు) పెంచుకునేవారు వాటితోపా టు పందెం కోళ్లను పెంచుతున్నారు.


నాటుకోళ్లకు కిలో చొప్పున మామూలు ధర ఉండగా, పందెం కోళ్లకు మం చి డిమాండ్‌ ఉంటుంది. ఒక్కో కోడిపుంజు పెంపకం కోసం సాధారణంగా వాడే విత్తనాలు కాకుండా బా దాం, ఖాజు లాంటి విలువైన పోషక పదార్థాలు వాడడంతో ఏడాదిలోనే పందెం కోడి నాలుగైదు కిలోలకు చేరుకుంటుంది. ఒక్క పుంజు ఖరీదు రూ.2 వేల నుంచి 5 వేలు పలుకుతోంది. రహస్యంగా వ్యాపారులు ఈ ప్రాంతం నుంచి సేకరించిన పందెం కోళ్లను సంక్రాంతి సీజన్  సమయంలో కోనసీమ ప్రాంతంలో జరిగే పోటీ ల్లో పాల్గొనే పందెంరాయుళ్లకు విక్రయిస్తున్నారు.


స్థాని కంగా లభిస్తున్న కోళ్లకు కోనసీమ ప్రాంతంలో రూ.10వేల వరకు ధర పలుకుతుందని చెబుతున్నారు. అలాగే చంద్రాపూర్‌ ప్రాంతంలోనూ ఇదే ధర ఉంటుం దని అంటున్నారు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై శ్రద్ధచూపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పం దెం కోడి పిల్ల ఖరీదు రూ. 300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. దీనిని పెద్ద సనుగు అంటూ విక్రయిస్తుంటారు. ఏడాదిలో పెట్టిన పెట్టుబడి పదింతలవుతుంది. దీంతో నాటుకోళ్లు రెండు గంపలుగా పెంచడం కన్నా నాలుగు పందెం కోళ్లను పెంచితే రెట్టింపు లాభం వస్తుందని పెంపకందారులు అంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top