హర్తాళ్ ప్రశాంతం

హర్తాళ్ ప్రశాంతం


జిల్లావ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, మానవహారాలు

అనుమతులు లేవంటూ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

స్వచ్ఛందంగా మూతపడ్డ వ్యాపార, విద్యా సంస్థలు

యధావిధిగా పనిచేసిన బ్యాంకులు, కొన్ని చోట్ల మూతపడ్డ ఏటీఎంలు


 

 సాక్షి, విశాఖపట్నం: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలకు నిరసనగా విపక్షాలు నిర్వ హించిన హర్తాళ్ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష నేతలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నగరంలో, రూరల్‌లో భారీగా రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు హర్తాళ్‌కు సహకరించారుు. స్వచ్ఛందంగా దుకాణాలు, స్కూళ్లు మూతపడ్డారుు. కరెన్సీ కష్టాలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమం కావడంతో వారి నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నిరసన యత్నాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. నిరసనకారులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వందలాదిమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయని ముందుగా చెప్పినప్పటికీ చాలాచోట్ల అవి కూడా మూత పడ్డారుు. హర్తాళ్ నుంచి ఆర్టీసీని మినహారుుంచడంతో బస్సులు నడిచారుు.



అరెస్టుల పర్వం

మద్దిలపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, తూర్పు నియోజకవర్గం కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో వద్ద బైఠారుుంచి కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలో దిగి పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఐ, సీపీఎం కార్యకర్తలు మద్దిలపాలెం నుంచి ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వెళ్లాల్సిన ర్యాలీకి పోలీసులు అనుమతులు నిరాకరించి, స్వర్ణభారతి స్టేడియం వద్ద ఆరెస్ట్‌లు చేపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగదాంబ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, సీపీఐ నగర కార్యదర్శి మార్కండేయులు కార్యకర్తలు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించడంతోపాటు ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.



 అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ నర్సీపట్నంలో కొంతమంది వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో 15వ వార్డులోని దొండపర్తిలోని ఎరుకుమాంబ ఆలయం సమీపంలోని జంక్షన్‌లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. చోడవరంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.



పెందుర్తి కూడలి వద్ద భారీ మానవహారం చేసి రోడ్డుపై నాయకులు బైఠారుుంచారు. వారి నిరసనను పోలీసులు అడ్డుకుని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, సీపీఎం నాయకులు అప్పలరాజు, అనంతలక్ష్మి, సీపీఐ నాయకులు శ్రీనివాసరావు, రాంబాబు సహా 100 మందిని అరెస్ట్ చేశారు. గాజువాకలో 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను, 13 మంది వాపపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌ఎడీ జంక్షన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌తోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలిలోనూ వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డారుు. బ్యాంకులు తెరుచుకున్నప్పటికీ ఏటీఎంలు చాలా వరకూ పనిచేయలేదు. దీంతో ఎప్పటిలాగే జనానికి క్యూ బాధ తప్పలేదు.

 

సిటీలో 9 కేసులు నమోదు చేసి 209 మందిని అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలో ఆరు కేసులు పెట్టి 102 మందిని అరెస్ట్ చేశారు.  ఆ వివరాలిలా ఉన్నాయి:

 ప్రాంతం    వైఎస్సార్    సీపీఐ    సీపీఎం    కాంగ్రెస్    స్టూడెంట్స్  మొత్తం

 సిటీ             53         77        76             0              3          209

 రూరల్         27         38        34             3              0          102

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top