బంద్ పాక్షికం

బంద్ పాక్షికం


నిరసనలు తెలిపిన ప్రతిపక్షాలు    

కేంద్రం, ప్రధాని దిష్టిబొమ్మల దహనం

ఎక్కడికక్కడ అరెస్ట్‌లు    

నడిచిన బస్సులు


కరీంనగర్ : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వామపక్షపార్టీలు ఇచ్చిన సోమవారం నాటి బంద్ జిల్లా కేంద్రంలో పాక్షికంగా జరిగింది. అధికార టీఆర్‌ఎస్‌పార్టీ తటస్థంగా ఉండడం, కాంగ్రెస్ కేవలం నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో బంద్‌ప్రభావం పెద్దగా కనిపించలేదు. వ్యాపారవాణిజ్య  వర్గాలు అక్కడడక్కడ సహకరించగా కొన్ని చోట్ల స్పందన కరువైంది. జిల్లా కేంద్రంలో  విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలను  మూసివేరుుంచారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రధాన రహదారిపై ధర్నాకు యత్నించగా పోలీసులు అడ్డుకొని డీపీటీసీ సెంటర్‌కు తరలించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన తెలంగాణచౌక్‌లో నల్లజెండాలతో నిరసన తెలపగా..పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై మధ్యాహ్నం వదిలిపెట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గీతాభవన్, మంకమ్మతోట, కమాన్‌చౌరస్తాలలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు.



కాంగ్రెస్ ధర్నా

డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో నల్లజెండాలతో ధర్నా చేపట్టారు. మృత్యుంజయం మాట్లాడుతూ ప్రధాని నిర్ణయంతో దేశంలోని 70 శాతం సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా ఏకపక్షంగా పెద్దనోట్లను రద్దు చేసి సామాన్యుల ప్రాణాలను బలితీసుకున్న ఘనత బీజేపీకే దక్కిందన్నారు. కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రహమత్ హుస్సేన్, దిండిగాల మధు, ఉప్పరి రవి, చెర్ల పద్మ, ముస్తాక్, ఎలగందుల మల్లేశం, ఒంటెల రత్నాకర్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, అంజన్‌కుమార్, వెంకటరమణ, వెన్న రాజమల్లయ్య, రాంచందర్, ప్రమోద్‌రావు, రాజేంద్రప్రసాద్, నిహాల్ హైమద్, ఎం.డీ తాజ్, భూమయ్య, దేవేందర్, ఇమ్రాన్, నదీమ్, చంద్రయ్యగౌడ్, బాలరాజు, చంద్రశేఖర్, అఖిల్, రవి, ఉయ్యాల శ్రీనివాస్, తాళ్లపెల్లి అంజయ్యగౌడ్, అలీ, పొలాస వాసు, నయీం, చాంద్, ఆసిఫ్ పాల్గొన్నారు.



సీపీఎం ఆధ్వర్యంలో

సీపీఎం నాయకులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఎస్.సంపత్, రమేశ్, సదానందం ఉదయమే బస్టాండ్‌కు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఏసీపీ రామారావు, సీఐ హరిప్రసాద్ అరెస్ట్ చేసి డీపీటీసీకి తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు. సీపీఎం జిల్లాకార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు చేసి ఇరువై రోజులు గడుస్తున్న ప్రజల ఇబ్బందులు తీర్చడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.  



ప్రధాని దిష్టిబొమ్మ దహనం

అఖిల భారతయువజన సమాఖ్య(ఏఐవైఎఫ్), అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో కమాన్‌చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లేశం మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను బ్యాంకులు, ఏటీఏంల చుట్టూ తింపడం మోడీ అవివేకానికి నిదర్శనమన్నారు. కసిబోజుల సంతోష్‌చారి, నునావత్ శ్రీనివాస్, సందీప్‌రెడ్డి, సారుుకృష్ణ, రమేశ్, సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో

బంద్‌ను విఫలం చేసేందుకు ప్రతిపక్షనాయకులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణచౌక్‌లో డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఐద్వా నాయకురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగదు రహిత సమాజాన్ని సృష్టిస్తానని చెప్పిన ప్రధాని.. పెద్దనోట్లు రద్దు చేసి నగదు లేని సమాజంగా మార్చారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐజిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, నాయకులు భాస్కర్‌నాయక్, స్వరూప, రమేశ్‌గౌడ్, సురేష్, రాజు పాల్గొన్నారు.

 

వైఎస్సార్‌సీపీ ధర్నా

కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సామాన్యులకు గుదిబండగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. డాక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు స్విస్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల నల్లధనాన్ని వెలికి తీసి సామాన్యులకు పంచిపెడతామని ప్రగల్బాలు పలికిన ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడస్తున్నా ఆ దిశగా చర్యలు శూన్యమన్నారు. ఏకపక్షంగా పెద్దనోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బోగె  పద్మ, వెంకటరమణారెడ్డి, గండి శ్యాంకుమార్, సాన రాజన్న, దుబ్బాక సంపత్, మోకనపెల్లి రాజమ్మ, జావిద్, సుధాకర్‌రావు, వరాల అనిల్, ఎడ్ల సురేందర్‌రెడ్డి, దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top