ఏకీకరణ సాధ్యమే..


  • పంచాంగకర్తల సదస్సులో వక్తలు   

  • సంస్కరణలను అమలు చేయాలని డిమాండ్‌

  • రాజమహేంద్రవరం కల్చరల్‌ : 

    పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం దుస్సాధ్యమైనా అసాధ్యం కాదని వ్యాకరణ వేదాంత వాగీశ, విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.టి.కె.శ్రీరంగాచార్యులు అన్నారు.  మహామహోపాధ్యాయ దివంగత మధుర కృష్ణమూర్తి శాస్త్రి స్థాపించిన జ్యోతిష విజ్ఞాన కేంద్రం, విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జాంపేట ఉమారామలింగేశ్వర కల్యాణమండపంలో భిన్న పంచాంగ గణిత, ధర్మశాస్త్ర విధానాలపై జరిగిన పంచాంగకర్తల సమన్వయ సదస్సులో ఆయన పర్యవేక్షకుడిగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహురుడు సూచించిన సంస్కరణలను అమల్లోకి తీసుకురాగలిగితే, చాలా వరకు ఏకాభిప్రాయాన్ని సాధించవచ్చని ఆయన తెలిపారు. 

    భార్యాభర్తల మధ్య గొడవల్లాంటివి..

    పంచాంగకర్తల మధ్య కలహాలు భార్యాభర్తల మధ్య గొడవల్లాంటివి. వివాదాలకు, కలహాలకు తావు లేకుండా ఏ శాస్త్రమూ లేదు. ఏకాభిప్రాయం ఒక గంటలోనో, ఒక సదస్సుతోనో వచ్చేది కాదు.  అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకుంటూ, దేశానికి ఆదర్శమైన సదస్సుగా దీనిని తీర్చిదిద్దుతాం.

    – శ్రీపాద సత్యనారాయణమూర్తి, తిరుపతి సంస్కృత విద్యాపీఠం విశ్రాంత ప్రిన్సిపాల్‌  

    మూడో నెలలో గర్భిణికి జరిపే పుంసవనంద్వారా గర్భంలోని జీ¯Œ్సలో మార్పువచ్చి, కోరిన బిడ్డపుడతాడు.

    – మధుర ఫాలశంకరశర్మ, సంస్థల కార్యదర్శి, పంచాంగకర్త

    ప్రచారం సరికాదు..

    ‘‘మా పంచాంగం లక్షల ప్రతులు అమ్ముడవుతున్నాయని పంచాంగకర్తలు ప్రచారం చేసుకోవడం సరికాదు. పంచాంగాల్లోని శాస్త్రీయతను మనం పరిశీలించాలి, హైదరాబాద్‌కు, రాజమహేంద్రవరానికి మధ్య సూర్యోదయ కాలంలో 12 నిముషాల తేడా ఉంది, దీనిని బట్టి సహజంగానే పంచాంగ గణనల్లో తేడాలు వస్తాయి. పంచాంగాలు ఏకమవడం కష్టం, అన్ని దేశాలకు ఒకే విధంగా పంచాంగ గణన అసాధ్యం. అయితే అయనాంశాలలో మూలసూత్రాలు, ప్రాథమిక సూత్రాల్లో ఏకాభిప్రాయానికి రాగలిగితే, పంచాంగకర్తల మధ్య దూరాలు తగ్గుతాయి. 

    – డాక్టర్‌ చిర్రావూరి శ్రీరామశర్మ, సాంగవేదభాష్య విశారద  

    మార్పులు పరిగణనలోకి తీసుకోవాలి

    సూర్యాదిగ్రహగతుల వేగంలో మార్పులు వస్తాయి. పంచాంగకర్తలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. 

    – గొడవర్తి సంపత్‌కుమార్‌ అప్పలాచార్య,  పంచాంగకర్త, పాల్వంచ 

    కలియుగం ప్రారంభమై 5,118 ఏళ్లు గడిచాయి. క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరం, ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. ఈ విషయంలో పంచాగకర్తల మధ్య విభేదాలు లేవు. 

    – తంగిరాల వేంకట కృష్ణప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం  ఆస్థాన పంచాంగకర్త

    ప్రముఖ జ్యోతిష విద్వాంసుడు పిడపర్తి పెదపూర్ణయ్య పంచాంగ గణితాన్ని తాను అనుసరిస్తున్నాం. 60, 70 సంవత్సరాలుగా అయనాంశ వివాదగ్రస్తమవుతోంది. ఏ సిద్ధాంతం పూర్తిగా సరైనదో చెప్పగల న్యాయనిర్ణేతలు లేరు. జవహర్‌లాల్‌ నెహ్రూ నియమించిన కేలండర్‌ రిఫార్మ్స్‌ కమిటీ సూచనలనే తాము అనుసరిస్తున్నాం

    – బుట్టే వీరభద్రదైవజ్ఞ,

    శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి 

     

    నవ్వులు రువ్విన వ్యాఖ్యలు

    ముహూర్తాలు మూఢనమ్మకాలు, జ్యోతిషం నా¯ŒSసెన్స్‌ అని పదేపదే చెప్పే చానల్‌ అధినేత తాను ప్రారంభించే కొత్త కార్యక్రమానికి ముహూర్తం కోసం వెతుక్కుంటాడు (శ్రీపాద సత్యనారాయణమూర్తి).

    · కొన్ని చానళ్లకు పండితులంటే లోకువ. త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని పండితులు వాదులాడుకుంటే, వారు అనందిస్తారు.( డాక్టర్‌ ఎస్‌టీకే రంగాచార్యులు)

    · శ్రీశైలం దేవస్థానం విద్వాంసుడు బుట్టే వీరభద్ర దైవజ్ఞ మధుర కృష్ణమూర్తి శాస్త్రి పంచాంగగణనపై కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు, పండితుల మధ్య వేడివాడిగా చర్చలు జరిగాయి. వక్తలను చిర్రావూరి శ్రీరామశర్మ కొన్ని విషయాల్లో వివరణలు అడిగారు. పెద్ద సంఖ్యలో జ్యోతిష శాస్రా్తభిమానులు హాజరయ్యారు. మధురవారి హేవలంబి నామసంత్సర పంచాంగాన్ని చిర్రావూరి శ్రీరామశర్మ, ఇతర అతిథులు ఆవిష్కరించారు. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top