పాలేరును పరిశీలించిన ఎన్నెస్పీ ఎస్‌ఈ

రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఈ


కూసుమంచి : పాలేరు రిజర్వాయర్‌ను  ఆదివారం ఎన్నెస్పీ ఎస్‌ఈ కోటేశ్వరరావు పరిశీలించారు. ఎగువన భారీ వర్షాల కురిసిన కారణంగా రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆయన సిబ్బందితో కలిసి సమీప నల్గొండ జిల్లాలోని నర్సింహాపురం వాగును పరిశీలించారు. వరద ఉధృతిని అంచనా వేశారు. రిజర్వాయర్‌కు ప్రమాదం తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రిజర్వాయర్‌కు సుమారు 4,000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేయాలని సిబ్బందిని ఆదేశించారు.  అనంతరం నాయక¯ŒSగూడెం వద్ద ఇ¯ŒSఫాల్‌ రెగ్యులేటరీ కాలువలో నీటి ప్రవాహాన్ని ఎస్‌ఈ పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్‌ వద్ద పరిస్థితిని సిబ్బందితో సమీక్షించారు. ఇ¯ŒSటేక్‌వెల్‌ రింగ్‌బండ తెగి పోయి ఇ¯ŒSటేక్‌వెల్‌లోకి నీరు చేరగా.. దీని గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఎక్కువైతే ఎడమ కాలువకు నీటి విడుదలను పెంచాలని సూచించారు. ఈ నీటితో చెరువులను నింపనున్నట్లు   ఎస్‌ఈ వివరించారు. ఆయన వెంట డీఈలు మన్మధరావు, వెంకటేశ్వరరావు, జేఈలు రమేష్‌రెడ్డి, నరేందర్, వర్క్‌ ఇ¯ŒSస్పెక్టర్‌ వాసూ తదితరులు ఉన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top