పాలమూరుకు మిగిలింది 103 గనులే!

పాలమూరుకు మిగిలింది 103 గనులే!


అందులోనూ 33 గనుల్లోనే పనులు

రూ.11.34 కోట్ల సీనరేజ్ చార్జీల లక్ష్యం

నెల రోజుల్లోనే రూ.3.67 కోట్లు వసూలు

పునర్విభజనతో ఏడీ కార్యాలయం కుదేలు

రెగ్యులర్ ఉద్యోగులు నలుగురే

కార్యాలయాల్లో నెలకొన్న స్తబ్ధత


మహబూబ్‌నగర్ అర్బన్: జిల్లాల పునర్విభజన దెబ్బ గనులు, భూగర్భ వనరుల శాఖ పై భారీ ప్రభావం చూపింది. కొత్త జిల్లాల్లో ఆ శాఖ కార్యాలయాలు నెలకొల్పి, ఆ ప్రాంతాల్లో గల గనులను వాటి పరిధిలోకి మార్చారు. దీంతో ఒకప్పుడు ప్రాభవాన్ని సంతరించుకున్న మహబూబ్‌నగర్ ఏడీ ఆఫీస్ కుదేలైంది. గద్వాలలో అసిస్టెంట్ జియాలజిస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సీనియర్ అధికారిని నియమించగా, హబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జి ల్లాల్లో అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫీసులను నెలకొల్పారు. వీటితో పాటు కొడంగల్ అసెం బ్లీ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉ న్న నాపరారుు, గ్రానైట్, స్టోన్ క్రషర్ల పర్యవేక్షణను వికారాబాద్ జిల్లాకు, షాద్‌నగర్, ఫరూక్‌నగర్, కొత్తూరు. నందిగామ, కేశంపేట, కొందుర్గు, తలకొండపల్లి, ఆమనగ ల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల్లోని గను లు రంగారెడ్డి జిల్లాలో చేర్చడం తో మహబూబ్‌నగర్ ఏడీ కార్యాలయం పరిధిలో కార్యకలాపాల్లో స్థబ్దత ఏర్పడింది.


లీజుకు అనుమతి: ఏడీ

జిల్లాలో పలు రకాలైన 103 గనులను లీజు పద్ధతిపై కేటారుుంచారు. 54 స్టోన్ కటింగ్ అండ్ మెటల్ క్రషర్లు, 10 గ్రానైట్, 39 పలుగురాళ్ల గనులు లీజుకు ఇచ్చిన వాటి లో ఉన్నారుు. ప్రస్తుతం 38 మైన్‌‌స మా త్రమే పనిచేస్తున్నట్లు మైనింగ్ అండ్ జియాలజీ ఏడీ ప్రవీణ్‌రెడ్డి వివరించారు. 2016 అక్టోబర్ నుంచి 2017 మార్చి వరకు రూ.11.34 కోట్ల సీనరేజ్ చార్జీలను వసూలుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణరుుంచించగా ఒక నెల వ్యవధిలోనే రూ.3.67 కోట్లను  వసూలు చేశామని వెల్లడించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్తులకు వాటి దామాషా ప్రకారం అందజేస్తామని తెలిపారు. కాగా జిల్లాలో ఇసుకను సరఫరా చేసే బాధ్యతలను టీఎస్‌ఎండీసీకి ప్రభుత్వ అప్పగించిందని, కోరుుల్‌సాగర్, సంగంబండ, రామన్‌పాడ్ రిజర్వాయర్లలో కొంత భాగంలో గల పూడికలో ఉన్న ఇసుకను డీసిల్టింగ్ చేయాలని ఆదేశాలు వచ్చాయని, కాని వాటిలో నీరు ఉన్నందున ఆ పనులను ప్రారంభించలేదని తెలిపారు.


రెగ్యులర్ ఉద్యోగులు నలుగురే!

అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ డెరైక్టర్ జిల్లా స్థారుు అధికారి, కాగా ఒక్కొక్క రాయల్టీ ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, సర్వేయర్ పోస్టుల్లో మాత్రం రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, కొంత మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కార్యకలాపాలను నెట్టుకొస్తున్నారు. ఏడీని గ్రామ వికాస్‌తో పాటు పలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గానికి స్పెషల్ ఆఫీర్‌గా నియమించడంతో తగినంత సమయాన్ని గనుల శాఖకు వెచ్చించలేని స్థితి ఏర్పడింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top