పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు

పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు - Sakshi


బావిలోంచి సన్నటి ఊటగా నీటి ధార

మిషన్‌కాకతీయలో భాగంగా సుందరీకరణ

జేసీబీతో పని చేస్తుండగా బయటపడ్డ వైనం


చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆం జనేయస్వామి దేవాలయ ఆవరణలో శనివారం పుష్కరిణి (గుండం) సుందరీ కరణ పనులు చేపడుతుండగా పురాతనమైన బావి ఆనవాళ్లు కనిపించాయి. ఈ పుష్కరిణి అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా రూ.32లక్షలు మం జూరుచేసింది. ఈ పనులను ఇటీవల  మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభిం చారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా జేసీబీతో లోతు తీసే పని చేస్తుండగా పక్కనే ఉంచిన టిప్పర్ మట్టిలో కుంగడం కనిపించింది.


వెంటనే అప్రమత్తమై టిప్పర్‌ను పక్కకు తొలగిం చారు. జేసీబీతో అదే స్థలంలో లోతుగా తవ్వగా బావి ఆనవాళ్లు కనిపించాయి. సన్నగా నీటిధార వస్తుండడం ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ బావి ఉండేదని, కాలక్రమంలో వర్షాలకు మట్టి కూరుకుపోయి మూసుకుపోయి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారుగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం, పుష్కరిణి అతి పురాతనమైనది కావడంతో బావి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఆలయ పూజారి పి.రాఘవేంద్రాచారిని అడగ్గా అప్పట్లో బావి ఉన్నట్లు పెద్దలు చెబుతుండేవార న్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పురావస్తు శాఖకు ఈ విషయాన్ని విన్నవించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top