ప్రేమకు అనారోగ్యం!

ప్రేమకు అనారోగ్యం!


నాటి ప్రేమికుల అనురాగాన్ని దూరం చేస్తున్న కిడ్నీ వ్యాధి శాపంగా మారిన పేదరికం ప్రేమ అజరామరం.. ఎలాంటి వివక్ష చూపని స్నేహ బంధం యువతీయువకుల్ని ఒక్కటిగా చేసే ఆనంద గీతం శ్రీహరి.. లక్ష్మిలది ఈనాటి ప్రేమ కాదు అది 1999 ఎ లవ్ స్టోరీ వారి ప్రేమ సక్సెస్.. కాపురం కూడా! రోజా పువ్వుల్లాంటి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వృద్ధాప్యం వరకు ఈ జంట ప్రేమ పచ్చని చెట్టులా కళకళలాడేలా లేదు లక్ష్మిని రెండు కిడ్నీలూ మోసం చేశారుు గొప్ప ప్రేమికుడు తోడుగా ఉన్నా  ఆర్థిక ఇబ్బందులు వైద్యం చేరుుంచనంటున్నారుు...!



అప్పుడే తెల్లారింది. సూర్యుడు ఇంకా కోపం తెచ్చుకోకపోవడంతో వాతావరణం వేడెక్కలేదు. కందుకూరులోని ఆర్టీసీ బాస్టాండ్ జనాల గొడవకు చెవులు మూసుకుంది. భిక్షగాళ్లు చేతులు చాపుతుంటే ప్రయూణికులు చిరాకు పడుతున్నారు. ఇంతలో హైదరాబాద్ బస్ సర్వీసు బస్టాండుకు చేరుకుంది. అందులో నుంచి ఓ యువకుడు చిన్న బ్యాగుతో దిగాడు. అతను.. చుట్టాల ఇంటికో.. శుభకార్యానికో రాలేదు. పొట్ట చేత పట్టుకుని బతుకుపై ఆశతో దిగాడు.


 పట్టణంలోని తూర్పువడ్డెపాలెంకు చేరుకున్నాడు.. బేల్దారి పని ఏమైనా దొరుకుతుందో అని. బాగా దాహం వేసింది. ఓ ఇంటి దగ్గరకు వెళ్లాడు. ‘కొంచెం నీళ్లు ఉంటే ఇవ్వండయ్యూ’ అన్నాడు. లోపల నుంచి పదహారేళ్ల అమ్మారుు వచ్చి చేతికి గ్లాసు అందించింది. తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. అతనికి పని దొరికింది. అమ్మారుు.. అబ్బారుు మాటామాటా కలిసింది. కొద్దిరోజుల్లోనే ప్రేమలో పడ్డారు.


ఇది పదిహేడేళ్ల క్రితం జరిగిన ఘటన. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం.. తోషం గ్రామవాసి కామిరి శ్రీహరి, పట్టణానికి చెందిన కామెరి లక్ష్మి ప్రేమకు పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు. ఇద్దరూ ఒక్కటయ్యూరు. హైదరాబాద్‌తో పాటు ఎక్కడ పని దొరికినా ఇద్దరూ కలిసి బేల్దారి పనులు చేసుకుంటూ అన్యోన్యంగా గడిపేవారు. వారి కాపురానికి ఫలితంగా ఇద్దరు సంతానం కలిగారు. ఉప్పుచెరువులో కాపురం పెట్టారు.


జీవితం సాఫీగా సాగిపోదు కదా!  చక్కగా ఉన్న వారి కాపురంలో కిడ్నీ వ్యాధి వచ్చిపడింది. మూడేళ్ల క్రితం లక్ష్మి (35)కి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నెమ్ము చేరిందని డాక్టర్‌లు చెప్పడంతో మందులు వాడటంతో ఆరోగ్యం కుదుటపడింది. కానీ గత డిసెంబర్‌లో అనారోగ్యం పాలవడంతో పరీక్షలు చేయించుకున్నారు. నెల్లూరు వైద్యులు కిడ్నీ వ్యాధిగా తేల్చారు. అనంతరం ఒంగోలు రిమ్స్‌లో చూపించుకోగా గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. డయాలసిస్ చేయాలని తెలిపారు. అప్పటికే భార్య వైద్యం కోసం రూ. 2 లక్షలను శ్రీహరి ఖర్చు చేశాడు. ఇవి కాక మరో రూ. 70వేల వరకు అప్పులపాలయ్యాడు. ఇటీవల తన భార్య మరింతగా బాధ పడుతుండటంతో కందుకూరులో చూపించగా..  5వేల  రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. అతని వద్ద డబ్బు లేకపోవడంతో స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చారు. ‘ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. దేవుని పై భారం వేసి గడుపుతున్నాం. ప్రాణం ఉన్నంతవరకే మేమేమైనా చేయగలం’ అని దుఃఖించాడు.


చిన్నారులకు అమ్మా.. నాన్నకంటే గొప్పవారు ఎవరుంటారు. వారు ఏదైనా తెస్తే తింటారు. లేదా పస్తులుంటారు. ఇప్పుడు ఆ దంపతుల పిల్లలు అంజలి, సాయికృష్ణ ఇదే పరిస్థితిలో ఉన్నారు. మూడు పూట్లా కంచంలో అన్నం ఎందుకు రాదో తెలియదు. వాళ్ల అమ్మ మంచం ఎందుకు దిగదో తెలియదు. కోలుకోవాలంటే ఏం చేయూలో అర్థం కాదు. 8వ తరగతి చదువుతున్న కూతురు ఇంటి వద్దే ఉండి తల్లిని చూసుకుంటోంది. సాయికృష్ణ కూడా 8వ తరగతే చదువుతున్నాడు. కుమారుని పరిస్థితీ అలాగే ఉంది.


 ⇒ ఈ కుటుంబానికి తెల్ల కార్డు ఉంది. కానీ పొట్ట చేత పట్టుకుని ఊర్లు తిరుగుతుండటంతో నిలువునా కార్డు తొలగించారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవలు శ్రీహరి కుటుంబానికి అందడంలేదు. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదు. వీరి బాధను చూసిన ఒంగోలులోని ఓ కిడ్నీ సెంటర్ డాక్టర్.. లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు. ‘దీనిని ముఖ్యమంత్రి కార్యాలయూనికి తీసుకు వెళ్లి ఆరోగ్య కార్డు తెచ్చుకోండి. దీనివల్ల కొంత మేలు జరగవచ్చు’ అని చెప్పారు. ‘రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. నా సంపాదన నా భార్య బిళ్లలకు ఇవ్వాలా.. పిల్లల కూటికి ఇవ్వాలా. మా లాంటి వారిని ముఖ్యమంత్రి పలకరిస్తారా’ అని ఇంటి యజమాని వాపోయూడు. సాయం చేయదల్చిన దాతలు శ్రీహరి ఫోన్ నంబర్ 9550447964ను సంప్రదించవచ్చు.    - కందుకూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top