కుంభకోణంలో మరో కొత్త కోణం!

కుంభకోణంలో మరో కొత్త కోణం! - Sakshi


నిజామాబాద్‌ సీటీవో–1 కార్యాలయంలో సీఐడీ తనిఖీలు

‘బోధన్‌’ నిందితుల వివరాల ఆధారంగా సోదాలు  




నిజామాబాద్‌ నాగారం (నిజామాబాద్‌ అర్బన్‌): బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జరిగిన కుంభకోణంలో తీగ లాగిన కొద్దీ డొంక కదులుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ తాజాగా నిజామాబాద్‌కు చేరింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం (సీటీవో–1)లో బుధవారం సోదాలు నిర్వహిం చడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. బో ధన్‌లో జరిగిన కుంభకోణానికి, జిల్లా కేంద్రం లోని కార్యాలయం నుంచే పూర్తి సహకారం అం దినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు సమాచారం.



‘బోధన్‌ స్కాం కేసు’లో ఇప్పటికే ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిజామాబాద్‌ సీటీవో–1లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. నకిలీ చలానాలు సృష్టించి సర్కారు ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఒక్క బోధన్‌ సీటీవో కార్యాలయంలోనే రూ.70 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.



ఈ కుంభకోణంలో బోధన్‌కు, నిజామాబాద్‌ సీటీవో–1కు విడదీయని రాని బంధం ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. సీటీవో–1లోని ఉ న్న వాణిజ్య పన్నుల శాఖ అధికారి కంప్యూటర్‌నే హైజాక్‌ చేసి, అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. సీటీవో కంప్యూటర్‌ యూజర్‌ ఐడీ, పా స్‌వర్డ్‌ను తస్కరించి, లావాదేవీలు నిర్వహించిన ట్లు నిందితుల్లో ఒకరైన ఏసీటీవో జయకృష్ణ సీఐ డీ అధికారులకు విచారణలో వెల్లడించినట్లు తెలి సింది. దీంతో సీఐడీ అధికారులు బుధవారం ఆ కస్మికంగా సీటీవో–1లో సోదాలు చేశారు. కం ప్యూటర్‌ నుంచి చలానాలకు సంబంధించిన పూ ర్తి సమాచారాన్ని అధికారులు సేకరించారు. అ లాగే ఇక్కడి నుంచి జరిగిన పూర్తి స్థాయి లావాదేవీలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.



అధికారుల్లో గుబులు

ఈ కుంభకోణంతో శాఖలో పనిచేస్తున్న అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. దాదాపుగా నెల రోజుల నుంచి అక్రమాలకు పాల్పడిన అధికారులు భయపడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ కార్యాలయానికి, ఏ సెక్షన్‌కు సీఐడీ అధికారులు వచ్చి విచారిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. సీఐడీ కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులను విచారణ చేస్తూ వారికి సంబంధించిన సమాచారం కోసం ఆకస్మికంగా సంబంధిత శాఖలో త నిఖీలు చేపడుతున్నారు. కన్సల్టెంట్‌ శివరాజ్, అ తని కుమారుడు పట్టుబడితే మరిన్ని నిజాలు బ యటకు వచ్చే అవకాశం ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top