నో పెన్షన్.. నో రేషన్ .. నో క్యాష్

నో పెన్షన్.. నో రేషన్ .. నో క్యాష్


జీతాల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరినా ఉద్యోగులకు నిరాశే మిగిలింది. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రా పది వేలకే పరిమితం చేయడం, మరికొన్ని బ్రాంచ్‌ల్లో సొమ్ముల్లేవని చేతులేత్తేయడంతో చేసేది లేక రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి డబ్బులు దక్కినా అవి రూ. 2 వేలు నోట్లు కావడంతో ఇంట్లో చిల్లర ఖర్చులకు ఏ విధంగా నెట్టుకురావాలో తెలియక మల్లగుల్లాలు పడ్డారు.


పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు వార్డు కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడితే ఇక్కడ కాదు.. బ్యాంకులకు పొమ్మన్నారు. అక్కడకు వెళితే ఖాతాలో ఇంకా పింఛన్ సొమ్ము జమకాలేదని చెప్పడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులు మాత్రం ఖాతాలున్న ప్రతి ఒక్కరికి తొలిరోజే పింఛన్ వేసినట్టుగా ప్రకటనలు చేశారు. కానీ జిల్లాలో ఏ ఒక్కరికి తొలిరోజు పింఛన్ సొమ్ములు చేతికొచ్చిన దాఖలాలు కన్పించలేదు. 


 సకాలంలో సరుకులందక కొన్ని, ఈపాస్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాక మరికొన్ని రేషన్ షాపులు తెరుచుకోలేదు. రేషన్ డిపోల్లో స్వైపింగ్ మిషన్లు అనుసంధానం కాకపోవడంతో రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు వెనక్కి వెళ్లిపోయారు. మరికొంతమంది డీలర్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అరుు నా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సరుకులు పంపిణీ చేయలేదు.


విశాఖపట్నం :  నడవలేని వారు..కంటిచూపు లేనివారు.. ఎటువంటి ఆసరా లేని నిర్భాగ్యులు.. వితం తువులు, వృద్ధులు తొలిరోజే నిరాశకు గురయ్యారు. పంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడితే ఇక్కడ కాదు..బ్యాంకులకు పొమ్మన్నారు. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల వద్దకు వెళ్తే మీకు ఖాతాలో ఇంకా పింఛన్ సొమ్ము జమకాలేదని కొందర్ని.. మీకు ఖాతాలే లేవు కదా.. సొమ్ములెలా పడతాయంటూ మరికొందరికి చెప్పడంతో రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఖాతాలో పింఛన్ సొమ్ములు పడిన వారు సైతం తీసుకునే పరిస్థితి లేక అలో లక్ష్మణా అంటూ వెనుదిరగడం కన్పించింది. అధికారులు మాత్రం ఖాతాలున్న ప్రతి ఒక్కరికి తొలిరోజే పింఛన్ వేసినట్టుగా ప్రకటనలు చేశారు. కానీ జిల్లాలో ఏ ఒక్కరికి తొలిరోజు పింఛన్ సొమ్ములు చేతికొచ్చిన దాఖలాలు కన్పించలేదు. జిల్లాలో 3,24,947 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో ఖాతాలున్న 2,06,335 మందికి పింఛన్ సొమ్ము జమైనట్టుగా డీఆర్‌డీఏ పీడీ సత్యసారుు శ్రీనివాస్ ప్రకటించారు. కానీ వీరిలో ఏ ఒక్కరికి బ్యాంకుల్లో సొమ్ములివ్వలేదు.


రూపేకార్డుల కోసం పాట్లు

ఖాతాలున్న వారిలో 11,087 మందికి మాత్రమే రూపే కార్డులు అందజేశారు. కార్డులున్న వారికి సైతం వీటిని ఏ విధంగా వినియోగించాలో కనీస అవగాహన లేదు. దీంతో ఏ ఒక్కరూ రూపే కార్డు ద్వారా సొమ్ములు తీసుకున్న దాఖలాలు కన్పించలేదు. ఇక రూపేకార్డుల కోసం వేలాది మంది వృద్ధులు బ్యాంకుల పద్ద పడిగాపులు పడడం కన్పించింది. మోకాళ్లలో పట్టు తగ్గి, నడుం వంగిపోరుున పలువురు పండుటాకులు బ్యాంకు ఖాతాల కోసం బ్యాంకుల పడిగాపులు పడుతున్నారు. శీతాకాలమైనప్పటికీ వేసవికాలాన్ని తలపించే రీతిలో కన్నేర్ర చేస్తున్న సూర్య తాపానికి తట్టుకోలేక చెంతాండంత క్యూలైన్లలో నిల్చొలేక నరకం చూశారు.


తెరుచుకోని రేషన్‌షాపులు

సకాలంలో సరుకులందక కొన్ని, ఈపాస్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడంతో మరికొన్ని రేషన్ షాపులు తెరుచుకోలేదు. ఈపాస్ మిషన్లు వర్తింప చేసిన 1,624 షాపుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరపాలని నిర్ణరుుంచారు.


అరుుతే 873 మంది డీలర్లు మాత్రమే కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయగలిగారు. అరుుతే పారుుంట్ ఆఫ్ సేల్ మిషన్లతో సంబంధం లేకుండా ఈపాస్ మిషన్లలోనే ఆ మేరకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ ఎక్కువ అమలుకాలేదు. దీంతో ఈపాస్ వర్తింపచేసిన షాపుల్లో సైతం నగదు రహిత లావాదేవీలు తొలిరోజు ఎక్కడా ప్రారంభం కాలేదు. రేషన్ డిపోల్లో స్వైపింగ్ మిషన్లు అనుసంధానం కాకపోవడంతో రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు వెనక్కి వెళ్లి పోయారు. మరికొంతమంది డీలర్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అరుునప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సరుకుల పంపిణీని ప్రారంభించ లేదు. 


నగదు తీసుకోకుండా సరుకులు

డీలర్లకు, కార్డుదారులకు సగానికిపైగా ఖాతాలు, రూపె కార్డులు లేక పోవడంతో నగదు తీసుకోకుండా ఈ నెల సరుకులు పంపిణీ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యారుు. సరుకులను ఉచితంగా ఇచ్చేస్తే ఆ సొమ్ము తమకు తిరిగిలా చెల్లిస్తారో లేదో అనే ఆందోళనతో చాలా మంది డీలర్లు సొమ్ములిస్తేనే సరుకులంటూ మెలికపెట్టడంతో డబ్బుల్లేక చాలా మంది వెనుదిరగడం కన్పించింది. ఇప్పుడు డబ్బులు వసూలు చేసుకోకపోతే వచ్చే నెల సరుకులకు డీడీలు ఎలా తీయాలనే ఆందోళనతో డీలర్లు ఉన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top