బ్యాంకులు ఖాళీ


అవే కష్టాలు... అవే సమస్యలు... బ్యాంకుకెళ్తే... లెక్కలేనన్ని నిబంధనలు. ఏటీఎంలకెళ్తే క్యాష్‌రాదు. తీరా అందులోంచి వచ్చే రెండువేల నోటుకు చిల్లర దొరక్క అష్టకష్టాలు. ఇదీ జిల్లాలో మంగళవారం నాటి పరిస్థితి. పనిచేస్తున్న అరకొర ఏటీఎంల వద్ద ఇప్పటికీ బారులు తీరిన జనం కనిపిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండు రోజుల్లో ఒకటో తేదీ వస్తే అప్పటి పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడంలేదు. 

 

 విజయనగరం అర్బన్:కేంద్ర ప్రభుత్వం వెయి.. ఐదువందల నోట్లు రద్దు చేసి 20 రోజులు దాటుతున్నా ఇంకా కరెన్సీ కోసం ఇక్కట్లు తప్పటం లేదు. నోట్లు లేక బ్యాంకులు, మార్కెట్లు వెలవెలబోతున్నాయి. జిల్లాలోని 76 గ్రామీణ వికాస బ్యాంకులు, 16 జిల్లా సహకార బ్యాంకుల్లో దాదాపు లావాదేవీలు స్తంభించాయి. మిగిలిన అన్ని జాతీయ బ్యాంకుల్లోనూ కరెన్సీ నిండుకుంది. ఈ పరిస్థితి జిల్లా అంతటా గత రెండురోజులుగా కనిపిస్తోంది. రద్దు చేసిన పాత రూ. 500లు, రూ. 1,000 నోట్లతో ఒక వైపు బ్యాంకు చెస్టులు నిండిపోతే మరోవైపు రూ.100 నోట్లు, రూ.2 వేల నోట్లు లేక బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయారుు.

 

 డిపాజిట్లపైనే... ఆధారం

 సాధారణంగా బ్యాంక్‌లకు వచ్చిన జమలనే 80 శాతం చెల్లింపులకు వినియోగిస్తారు. పాత నోట్లు దాదాపు 80 శాతం మార్పిడి అరుున ఈ పరిస్థితుల్లో చెల్లింపు కోసం జమయ్యే సొమ్ములపైనే బ్యాంకులు ఆధారపడుతున్నారుు. సోమవారం నాటికే జిల్లాలోని అధికశాతం బ్యాంకుల్లో సొమ్ము నిండుకోవడంతో కొద్దో గొప్పో బ్యాంకులకు జమ అవుతున్నా దానినే ఖాతాదారుల అవసరం మేరకు చెల్లిస్తున్నారు. వ్యక్తిగతంగా వారానికి రూ.24 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధిక శాతం బ్యాంకుల్లో ఖాతాదారులు అడిగిన మేరకు సొమ్ములు ఇవ్వకుండా రూ. 1,000, రూ. 2,000లు ఇచ్చి సరిపెట్టారు. 

 

 బ్యాంకింగ్ రంగంలో రారాజులా నిలిచిన ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో సైతం నగదు నిల్వలు నిండుకున్నారుు. పట్టణంలోని ఒక  ప్రధాన బ్యాంచ్‌లో మంగళవారం పనిగంటలు ముగిసే సమయానికి కనిష్ట లావాదేవీలు రూ.20 లక్షలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 లక్షలకే పరిమితమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 289 ఏటీఎంలలో కేవలం 152 మాత్రమే పనిచేశారుు. వీటిలో 60 ఏటీఎంలలో మాత్రమే రూ.100 నోట్లురాగా, మిగిలిన అన్నింటిలోనూ రూ. 2,000 వచ్చినట్లు తెలుస్తోంది. నగదు పెట్టిన మూడు గంటల్లో సంబంధిత ఏటీఎంలు ఖాళీ అవుతున్నారుు. అరకొరగా సాగిన ఈ సర్వీసులు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇబ్బందుల్ని తీర్చలేదు. 

 

 రూ.500 కొత్త నోట్లు వచ్చాయంటూ ప్రచారం

 జిల్లాకు కొత్తగా రూ. 500ల నోట్లు వందకోట్లు విలువ గలవి వచ్చాయని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి వరకూ ఏ బ్యాంకుకూ విడుదల కాలేదు. ఇప్పుడే విడుదల చేస్తే ఆ మొత్తం సైతం రెండు రోజుల్లో అరుుపోతుందనీ, వచ్చే నెల జీతాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకులకు నగదు విడుదల చేయలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ఇబ్బంది కలగని విధంగా డిసెంబర్ 1కి కొత్త రూ.500 నోట్లు బ్యాంకులకు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ కారణంగా సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో జమ అయ్యే మొత్తాల నుంచే మరలా చెల్లింపులు చేసుకునే పరిస్థితి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా మార్కెట్‌లో చిల్లరలేక, రూ.2 వేల నోటు మార్చుకునే విధానంలేని పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాలు నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే హర్హం వ్యక్తం చేసిన అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కరెన్సీ కష్లాలతో వ్యతిరేకత కనబరుస్తున్నారు. నల్లకుబేరులను చేసేది ఏమీ లేదని, సామాన్యులే కరెన్సీ కష్టాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top