కొత్త ఊపిరి

కొత్త ఊపిరి - Sakshi


- జగన్‌ పోరుతో చిగురించిన అగ్రి గోల్డ్‌ బాధితుల ఆశలు

- జిల్లాలో 1.15 లక్షల కుటుంబాలకు మళ్లీ ధైర్యం

- జిల్లాలో చెల్లింపులు ఆగిపోయిన మొత్తం రూ.240 కోట్లు




జగనన్నతోనే..

అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా పలు వురి దగ్గర రూ.45 లక్షలకు పైగా కట్టించా. కొద్ది రోజుల పాటు నగదు సక్రమంగా చెల్లిస్తుండటంతో పూర్తిగా నమ్మాం. ఒక్కసారిగా కంపెనీ మూతపడటంతో నగదు చెల్లిం చిన వారందరూ తిరిగి కట్టాలని నాపై ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. రూ.10, రూ.15 వేల చొప్పున కట్టిన చిన్న పద్దుల వారికి స్వంత నగదు రూ.2.05 లక్షలు కట్టా. కంపెనీకి చెందిన వారిని అడుగుతుంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా పెడుతున్నారు.  త్వరలో మా అన్న కుమార్తె వివాహం ఉంది. వారికి సైతం నేను కట్టాల్సిన పరిస్థితి. సొమ్ము కట్టలేకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం.  ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ అధినేత జగనన్న బాధితుల తరఫున వాదించడంతో ప్రభుత్వం కొంత మేర దిగి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కష్టాలు తెలుసుకుని సమస్య పరిష్కరించాలి.

– సయ్యద్‌ మునీర్, అగ్రిగోల్డ్‌ ఏజెంట్, ఆత్మకూరు



ప్రభుత్వ తీరు సరికాదు

అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోకుండా స్వార్థరాజకీయాలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సరికాదు. ఎంతోమంది బాధితులు చనిపోయారు. ఇప్పటికే చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. వా రిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేస్తోం ది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పట్టుదలతోనే బాబు కాస్త దిగివచ్చారు. అసెంబ్లీలో అగ్రిగోల్డ్‌ విషయంపై చర్చకు వస్తే అధికార పక్షం మాత్రం పక్కదోవపట్టిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  డిమాండ్‌ చేస్తున్నట్లు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అంతే కాకుండా  ప్రభుత్వ ఖజానా నుంచి నగదు తీసి బాధితులకు ఇవ్వాలి. ఆ తరువాత అగ్రిగోల్డ్‌ ఆస్తులను అమ్ముకోవాలి.

– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు



సీబీఐ విచారణ జరపాలి

అగ్రిగోల్డ్‌ విషయంలో ప్రభుత్వం తీరుపై ఎన్నో అనుమానాలున్నాయి. అందుకే అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ చేసి బాధితులను న్యాయం చేయా లి. చాలా మంది నిరుపేదలు, సామాన్యులు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉన్నారు. ఇక నైనా న్యాయం చేయక పోతే బాధితులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించాలి.

–బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జెడ్పీ చైర్మన్‌



ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉంది

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. బాధి తులు చాలా వరకు నిరుపేదలు. వారిని తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని బాధితులకు ఇవ్వాల్సిన నగదును తక్షణమే ఇవ్వాలి.

– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే



సాక్షి ప్రతినిధి – నెల్లూరు : అగ్రి గోల్డ్‌ డిపాజిటర్ల తరఫున వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన పోరాటం బాధితులకు కొండంత ధైర్యం ఇచ్చింది. ప్రతి పక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ సాక్షిగా చేసిన పోరాటానికి ప్రభుత్వం కొంత మేర దిగివచ్చింది.  ఫలితంగా జిల్లాలోని 1.15 లక్షల మంది కుటుంబాలకు ధైర్యం వచ్చింది. తర్వాత విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షకు మద్దతు పలికిన జగన్‌ తాము అధికారంలోకి వచ్చిన అనంతరం బాధితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



  జిల్లాలో 1995లో నెల్లూరు కేంద్రంగా ప్రారంభమైన అగ్రిగోల్డ్‌ డిపాజిట్ల వ్యాపారం అంతకంతకూ విస్తరించింది. కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేటల్లో అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేశా రు. నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లు  సేకరించారు. మదుపు దారుల నుంచి వారి శక్తిని బట్టి రోజు, వారం, నెలకు లెక్కన డిపాజిట్లు స్వీకరించారు. దీంతో పాటు ఫిక్సిడ్‌ డిపాజిట్లు కూడా తీసుకుని అత్యధిక వడ్డీ ఇస్తామని జనాన్ని ఆకర్షించారు. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి జిల్లాలో 11వేల మంది ఏజెంట్లను నియమించారు. తమకు వచ్చే కమిషన్‌ వేల మొత్తంలో ఉండటంతో వారు జనాల దగ్గరకు వెళ్లి పెద్ద ఎత్తున డిపాజిట్లు కట్టించారు.



మహిళలు ఇంటిఖర్చుల నుంచి పొదుపు చేసి దాచుకున్న సొమ్ము కూడా అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ రకంగా అందిన సొమ్ముతో అగ్రి గోల్డ్‌ యాజమాన్యం జిల్లాలో సుమారు 2500 ఎకరాల భూములు కొనుగోలు చేసింది. వీటిలో రియల్‌ ఎస్టేట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విధంగా జిల్లాలో రూ.240 కోట్ల జనం సొమ్ము చెల్లింపులు జరక్కుండా ఆగిపోయింది. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అగ్రి గోల్డ్‌ మదుపు దారులకు చెల్లించాల్సిన సొమ్ము ఆగిపోయింది. ఏజెంట్లకు కమీషన్‌ కూడా నిలిపి వేశారు. దీంతో పొదుపు దారులకు అనుమానాలు కలిగి నెల్లూరు నగరం బృందావనంలోని  అగ్రి గోల్డ్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు ప్రారంభించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి.



రాష్ట్రంలో తొలి కేసు

అగ్రి గోల్డ్‌ మోసాలపై రాష్ట్రంలో తొలి కేసు నెల్లూరు నగరం మూడో పోలీసు స్టేషన్‌లో నమోదైంది. 2014 డిసెంబరు, 24వ తేదీ కోవూరుకు చెందిన వెంకట్రాం ప్రసాద్‌ అగ్రి గోల్డ్‌ తన గడువు తీరిన డిపాజిట్‌ మొత్తం చెల్లించలేదని అప్పటి ఎస్‌పీ సెంథిల్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  మూడో నగర పోలీసులు అదే రోజు సెక్షన్‌ 120 (బి),  420, 406, ఏపీ ప్రొటెక్షన్‌ డిపాజిటర్స్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌ 1999 కింద కేసు నమోదు చేశారు. 2015 జనవరి, 3వ తేదీ ఈ కేసు తదుపరి దర్యాప్తు కోసం క్రైం పోలీసులకు బదిలీ చేశారు. అనంతరం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి  అప్పగించింది. పోలీసులు జిల్లాలోని 2500 ఎకరాల భూమిని అటాచ్‌ చేసి అగ్రి గోల్డ్‌ కార్యాలయాలను సీజ్‌ చేశారు.



మదుపుదారుల్లో ఆందోళన

అగ్రి గోల్డ్‌ బాధితుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించినా తమకు న్యాయం జరక్కపోవడంపై జిల్లాలోని 1.15 లక్షల బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఈ వ్యవహారం హై కోర్టుకు చేరడం, అగ్రి గోల్డ్‌ యాజమాన్యానికి చెందిన ఆస్తులు విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించక పోవడంతో మదుపుదారుల్లో ఆందోళన అధికమైంది. 2014 డిసెంబరు, 29వ తేదీ  నెల్లూరు నగరం భక్తవత్సల నగర్‌కు చెందిన అగ్రి గోల్డ్‌  ఏజెంట్‌  నరసారెడ్డి గుండె పోటుతో కన్ను మూశారు. ఈయన ప్రజల నుంచి రూ.7 లక్షల పొదుపు చేయించారు.



ఒత్తిడి ఎక్కువ కావడంతో రూ.3 లక్షలు సొంత డబ్బు చెల్లించారు. మిగిలిన డబ్బుల కోసం తీవ్ర మైన ఒత్తిడి రావడంతో ఆయన గుండె పోటుకు గురై చనిపోయారు. కా>య కష్టం చేసి రోజు, వారం వారీగా దాచుకున్న సొమ్ము తిరిగి రాక పోవడంతో జిల్లాలో వేలాది కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక తమ సొమ్ము తిరిగి రావడంపై ఆశలు వదులుకున్న బాధితులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలోకి దిగడంతో కొత్త ఊపిరి వచ్చినట్లయింది. ఆయన ఒత్తిడితో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న అగ్రి గోల్డ్‌ బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, డిపాజిటర్ల మొత్తం తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో చెప్పడంతో ఆశలు చిగురించాయి.   



సభను తప్పుదోవ పట్టిస్తున్నారు

అగ్రిగోల్డ్‌ బాధితుల విషయం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడల్లా అధికార పక్షం మాత్రం సభను తప్పుదోవ పట్టిస్తోంది. నిజంగా అగ్రిగోల్డ్‌ బాధితులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారికి రావాల్సిన నగదు తక్షణమే ఇవ్వాలి. అధికార పార్టీలోని ఒక మంత్రిపై కూడా అగ్రిగోల్డ్‌ ఆస్తులలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై విచారణ జరిపాలి.

–మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే



ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

కొన్ని లక్షల మంది అగ్రిగోల్డ్‌ ఉచ్చులో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి  ఉంటే రాజకీయాలు చేయడం మానుకుని వారికి న్యాయం చేయాలి. ఒక మంత్రిపై కూడా అగ్రిగోల్డ్‌ ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రిపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో కమిటీని నియమించి విచారణ జరిపించాలి. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని బాధితులను ఆదుకోవాలి.       

 –కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే



తక్షణం న్యాయం చేయాలి

అగ్రిగోల్డ్‌ బాధితులు డబ్బులు కట్టి చాలా నష్టపోయి ఉన్నారు. తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ముందుగా బాధితులకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికే బాధితుల కుటుంబాలు చాలా నష్టపోయాయి. చాలా మంది నగదు లేక ఆత్మహత్యలు  కూడా చేసుకున్న సంఘటనలు జరిగాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై బాధితుల పక్షాన అసెంబ్లీలో కూడా చర్చకు పట్టుబట్టారు. నిరుపేదలు చాలా మంది ఈ ఊబిలో చిక్కుకుని ఉన్నారు. ప్రభుత్వం రాజకీయం చేయడం మాని బాధితులకు న్యాయం చేయాలి.                          

– పి.అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే  



దొంగ నాటకాలు ఆడుతోంది

ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ విషయంలో దొంగనాటకాలు ఆడుతోంది. బాధితులు ఎంతోమంది కట్టిన డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా కుటుంబాలు ఇప్పటికే వీధిన పడ్డాయి. అటువంటి వారిని ఆదుకోవాల్సింది పోయి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిదీ రాజకీయం చేస్తోంది. అగ్రిగోల్డ్‌ విషయం మాట్లాడాలనుకుంటే మైక్‌ కట్‌ చేస్తారు. ఒక మంత్రి మాత్రం అగ్రిగోల్డ్‌ ఆస్తులు అప్పనంగా కొని  బాధితులకు అన్యాయం చేస్తున్నారు. వీటన్నిటిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి.                    

– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే    



రూ.50 వేలు కంపెనీకి కట్టా   – షేక్‌ సర్దార్, అగ్రిగోల్డ్‌ బాధితుడు, ఆత్మకూరు

నా వెల్డింగ్‌ వ్యాపారం అభివృద్ధి కోసం అగ్రిగోల్డ్‌ కంపెనీని నమ్మి ఏజెంట్‌కు రూ.50వేలకు పైగా కట్టా. వారు చెత్తులెత్తేయడంతో నాకు దిక్కుతోచడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌ సీపీ అగ్రిగోల్డ్‌ సమస్యలు లేవనెత్తడంతో సమస్య పరిష్కారానికి కొంతైనా అవకాశం దొరికినట్లయింది.   



జగన్‌ పుణ్యమే          –పి. కావ్య, బాధితురాలు, వెంకటేశ్వరపురం(నెల్లూరు)

అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడంతో మాకు కొండంత భరోసా ఏర్పడింది. జగన్‌ వల్లే చంద్రబాబు ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకు రూ.3 లక్షల వరకు పరిహారం ఇస్తామన్నది . బాధితులందరికి న్యాయం జరిగితే అది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమే అని చెప్పాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top