రాజకీయ నాయకుడి రాసలీలల వీడియో..?

రాజకీయ నాయకుడి రాసలీలల వీడియో..? - Sakshi


సిరిసిల్లక్రైం:

ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుడొకరు ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని నెరిపిన సంఘటనపై రాజన్నసిరిసిల్ల జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిరిసిల్లలోని ఓ కౌన్సిలర్‌ వివాహితతో రాసలీలను కొందరు యువకులు వీడియో తీయగా.. భయాందోళనకు గురైన సదరు కౌన్సిలర్‌ తన పేరు బయటపడకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల రాజీవ్‌నగర్‌ ఏరియాలోని ఓ స్థావరంలో కొద్ది రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుండగా.. దాన్ని రోజూవారీగా గమనించిన స్థానిక యువకులు ఎలాగైనా సదరు నాయకున్ని పట్టించాలన్న క్రమంలో మాటు వేసినట్లు తెలిసింది.



శనివారం రాత్రి వీడియో వ్యవహారం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో బహిర్గతం కాకుండా నాయకుడు యత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా.. బయట జరుగుతున్న ప్రచారం, దానికి సంబంధించిన ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top