సత్యాగ్రహ యాత్ర సాగి తీరుతుంది

సత్యాగ్రహ యాత్ర సాగి తీరుతుంది - Sakshi

  • ముద్రగడను విమర్శించే అర్హత చినరాజప్పకు లేదు

  • 25న రావులపాలెంలో మొదలై.. 30న అంతర్వేదిలో ముగుస్తుంది

  • విలేకరుల సమావేశంలో  కాపు జేఏసీ చైర్మ¯ŒS వాసిరెడ్డి ఏసుదాసు

  •  

    రాజమహేంద్రవరం సిటీ :

    సత్యాగ్రహయాత్రకు కోర్టు అనుమతించినా ప్రభుత్వం  అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని, ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా యాత్ర కొనసాగుతుందని కాపు జేఏసీ చైర్మ¯ŒS వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టంచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాపుల ఉద్యమాన్ని అణగదొక్కడానికే సెక్ష¯ŒS 30 ఉందా అని ప్రశ్నించారు.రిజర్వేష¯ŒS మేము అడుక్కోవడం లేదని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని దాన్ని అమలు చేయని కోరుతున్నామన్నారు. ఏకులాన్ని ఇబ్బంది పెట్టకుండా ముద్రగడ ప్రశాంతంగా పాదయాత్ర చేపట్టారని దీన్నిఅందరూ స్వాగతించాలన్నారు. టీడీపీ కాపులకు ఎల్‌కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్య, రూ.వెయ్యి కోట్ల కేటాయింపు, పాత రిజర్వేష¯ŒS విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప యాత్ర అపేస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏడు నెలల్లో రిజర్వేష¯ŒS అమలు చేస్తామని ముదగ్రడ కు మాటిచ్చిన మంత్రులు, నాయకులు పత్తా లేకుండా పోయారన్నారు.కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS కాపుల కోసం పనిచేయకుండా చంద్రబాబు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు  రావులపాలెం నుండి బయలు దేరిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర 30వ తేదీకి అంతర్వేది చేరుతుందన్నారు, రోజుకు 18, 20 కిలోమీటర్ల చొప్పున  దారిలో అయినవిల్లి, అమలాపురం మీదుగా 5 రాత్రులు ఒక పగలుగా యాత్ర కొనసాగనున్నదన్నారు. కాపులు వేలాదిగా తరలిరావాలన్నారు. కాపు నాయకులు, వైఎస్సార్‌సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్, ఉమామహేశ్వరి, వైకేఎల్, కొత్తపేట రాజా, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 

    కాపు పాదయాత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలి 

    అమలాపురం టౌ¯ŒS: ఈనెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమలో చేపట్టనున్న పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేయాలని కాపు మిత్ర బృందం ప్రతినిధులు కాపు ఉద్యమ నేతలకు శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. ఆ మిత్ర బృందం చైర్మ¯ŒS డాక్టర్‌ జి.హరిచంద్రప్రసాద్‌ కోనసీమలో పర్యటించారు. అమలాపురంలో  కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, కల్వకొలను తాతాజీ, మిండగుదిటి మోహ¯ŒSలను స్వయంగా కలసి అనుమతికి దరఖాస్తు చేసుకునే విషయమై మాట్లాడి వినతి పత్రాలు అందజేశారు. త్వరలో రాష్ట్ర మంత్రులను కూడా కలిసి పాదయాత్రకు అనుమతి  కోరతామని కాపు మిత్ర బృందం ప్రతినిధులు బండారు రామమోహనరావు, కరాటం ప్రవీణ్, ఏఎస్‌డీ ప్రసాదరావు, సత్తి బాపూజీ పేర్కొన్నారు. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top