బీజేపీ హామీలను నిలబెట్టుకోలేదు..

బీజేపీ హామీలను నిలబెట్టుకోలేదు.. - Sakshi


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవడంలో బీజేపీ విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇప్పటి వరకు ఈ ప్లాంట్ నిర్మాణంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక, గిట్టుబాటుధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం మాత్రం వరి ధాన్యానికి కేవ లం రూ.50 పెంచిందన్నారు.



పత్తికి రూ.4,100 ధర నిర్ణయించినా.. అమలుకావడం లేదని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం మద్దతు రేట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించినా కేంద్రం పట్టిం చుకోవడం లేదన్నారు. రైతు లు పండించిన పంటలో క్విం టాల్‌కు ఎంత ఖర్చు అవుతుందో దానికి అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసినా దానిని పక్కకు పెట్టిందని విమ ర్శించారు. ఎన్నికల ముందు బీజేపీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందన్నారు.



రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో  వీటిపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. రైతుల పంటకు కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు తోడు రాష్ట్రం కూడా కలిపి ఇస్తే ఆత్మహత్యలు ఉండేవి కాదన్నారు. మార్కెట్లకు వస్తున్న వరిధాన్యానికి అదనంగా రూ.300 రైతు నిధి ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యధిక మండలాలను కరువుప్రాంతాలుగా ప్రకటిం చేందుకు రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top