తల్లీకూతురుపై లైంగికదాడి

తల్లీకూతురుపై లైంగికదాడి - Sakshi


బెల్లంపల్లి:

కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు తల్లిని, ఆమె మైనర్‌ కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బెల్లంపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వన్‌టౌన్‌ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలోని హన్‌మాన్‌బస్తీకి చెందిన అన్వర్‌ అనే యువకుడు వన్‌టౌన్‌ పరిధిలోని ఓ బస్తీకి వెళ్లి మహిళపై, ఆ తర్వాత ఆమె కూతురు మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడు.



మానవత్వం మరిచిపోయి ఇంట్లో చొరబడిన సదరు యువకుడు చేసిన దారుణ ఘటనతో ఆ తల్లి, కూతురు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. జరిగిన అవమానాన్ని దిగమింగుకొని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగుచూడడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top