వెతల జీవులు

వెతల జీవులు


క్యూలో నిలబడి ఏటీఎంను చేరితే రూ.2 వేలు

బ్యాంకులో బారులు తీరితే రూ.10 వేలు

నెలవారీ అవసరాలు తీరేదెలా?

వెలవెలబోతున్న చిన్నచిన్న దుకాణాలు

గత్యంతరం లేక కార్పొరేట్ మాల్స్‌వైపు చూపు

కనీస ఖర్చులకూ కరెన్సీ లేక నానా అగచాట్లు


ఒకటో తేదీ రానే వచ్చింది. వేతన జీవులకు కష్టాలు మొదలయ్యారుు. మీరు సరిగ్గానే విన్నారు. మొదలరుు్యంది కష్టాలే. సాధారణంగా నెలాఖరున ఇబ్బంది పడే ఉద్యోగులు ఒకటో తేదీన జీతం అందగానే ఊపిరి పీల్చుకుంటారు. కానీ ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నారుు. జీతాలు బ్యాంకు ఖాతాలో పడినప్పటికీ ఈసారి ఉద్యోగుల చేతిలో చిల్లిగవ్వ లేదు. వచ్చిన జీతంతోనే ఇల్లు గడవాలి. ఇంట్లో సరుకులు, ఇంటి అద్దెలు, పాలు, పేపర్ బాయ్, కూరగాయల షాపులకు డబ్బులివ్వాలి. ఇవి మాత్రమే కాకుండా ఐదో తేదీన అమ్మారుుట్యూషన్ ఫీజు, కేబుల్ చార్జీలు కూడా చెల్లించాలి. అరుుతే ఎలా...? బ్యాంకు నుంచి డబ్బు పొందడమెలా ??  ఒక మోస్తరు ఉద్యోగులందరిలోనూ ఇదే కలవరం.


తిరుపతి : ఇంతకు ముందు ప్రతి నెలా ఒకటో తేదీన చిన్నాచితకా ఉద్యోగుల వదనంలో కాస్తంత ఆనందం కనిపించేది. ఈసారి మాత్రం అది లేదు. ప్రస్తుతం నెలకొన్న భిన్నపరిస్థితులే కారణం. ఉద్యోగుల ప్రయోజనార్థం బ్యాంకుల్లో అవసరమైన మేర విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ చెప్పినా, జిల్లా వ్యాప్తంగా ఆ సదుపాయం కానరావడం లేదు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె వంటి ప్రధాన పట్టణాల్లో ఎక్కడికెళ్లినా బ్యాంకుల్లో రూ.10 వేలు, ఏటీఎంల్లో రూ.2 వేలు మాత్రమే అందుతున్నారుు. గురువారం ఉదయం పలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల ముందు క్యూ కట్టిన ఉద్యోగులు మూడు గంటల పాటు నిలబడినా అవసరమైన మేర డబ్బు పొందలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి 594 ఏటీఎంలు ఉండగా, గురువారం సగానికి పైగా మెషీన్లలో క్యాష్ లేదు. ఉన్నచోట వందల కొద్దీ కస్టమర్లు క్యూలు కట్టారు. డబ్బు తీసుకోవాలంటే కనీసం రెండు గంటలైనా నిలబడాల్సిన పరిస్థితి. ఇకపోతే బ్యాంకుల కెళ్లిన ఖాతాదారులకు సరిపడా నగదు ఎక్కడా లభ్యం కాలేదు. కొన్ని బ్యాంకులు రూ.10వేలు, మరికొన్ని రూ.6 వేలు విత్‌డ్రాలకు అనుమతించారుు. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా అటు బ్యాంకుల్లోనూ, ఇటు ఏటీఎంల్లోనూ సుమారు రూ.70 కోట్ల విత్‌డ్రాలు జరిగినట్లు సమాచారం.


సరుకులన్నీ మాల్స్‌లోనే..

చేతిలో కరెన్సీ లేక ఉద్యోగులు నెలవారీ ఇంటి సరుకుల కోసం రిలయన్‌‌స, డీమార్ట్, బిగ్‌బజార్ వంటి కార్పొరేట్ మాల్స్‌కు పరుగులు తీశారు. అక్కడ కూడా తిప్పలే. సరుకులన్నీ కొనుగోలుచేసి రద్దీలో బయట పడేందుకు కనీసం మూడు గంటలు పడుతోంది. అక్కడ డెబిట్ కార్డులు ఉపయోగించి నగదు చెల్లింపులు జరిపిన ఉద్యోగులు మొదటి వారంలో నగదు రూపేణా చెల్లించాల్సిన చేతి ఖర్చుల గురించి ఆలోచనల్లో పడ్డారు. పాల బిల్లు, పేపర్ బాయ్, కేబుల్ టెక్నీషియన్లకు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు.


కార్డులు పాడవుతున్నాయ్..

గడచిన వారం రోజులుగా ఏటీఎం కార్డులను రోజూ వాడుతున్నందున చాలామంది కార్డులు పాడై పనిచేయడం లేదు.  ఏ వస్తువు కావాలన్నా స్వైపింగ్ మెషీన్ ముందు డెబిట్ కార్డు తీయాల్సి వస్తోంది. దీంతో రోజుకు నాలుగైదు సార్లు స్వైప్ చేస్తుండటంతో కార్డులు త్వరగా పాడవుతున్నాయని వినియోగదారులు బ్యాంకర్ల దగ్గర ఫిర్యాదులు చేస్తున్నారు. కొత్త కార్డు రావాలంటే కనీసం 15 రోజులు పడుతుంది. చేతిలో నగదు లేక, కార్డు పనిచేయక ఏం చేయాలో అర్థం కావడం లేదని తిలక్‌రోడ్ ఎస్‌బీఐ ఖాతాదారులు కేశవ్, లతాదేవి వాపోయారు.


చిన్నా చితకా వ్యాపారాలన్నీ మూతే...

ఈ-పోస్ మెషీన్ల రాక వల్ల చిన్నా చితకా వ్యాపారాలన్నీ మూతపడే పరిస్థితులు నెలకొన్నారుు. స్ట్రీట్ వెండర్లు, చికెన్ సెంటర్లు, సెలూన్ షాపులు, కిళ్లీ కొట్లు, ఐస్‌పార్లర్లు, తోపుడు బండ్ల వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిస్థితి ఇలాగే ఉంటే దుకాణాలు మూసివేయాల్సిందేనని వీరంటున్నారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top