నోట్ల చిక్కులు..జనానికి చుక్కలు

నోట్ల చిక్కులు..జనానికి చుక్కలు

  • 50 వేల మంది ఉద్యోగులకు నిరాశే

  • వెనుతిరిగిన పింఛ¯ŒSదారులు 

  • పండుటాకులకూ పడరాని పాట్లు

  • జనం శాపనార్థాలు

  • అన్ని చర్యలూ తీసుకున్నామన్న పాలకుల మాటలు హుష్‌కాకి

  •  

    సాక్షి ప్రతినిధి, కాకినాడ :

    సామాన్య, మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల జీవితాలు ఒకటో తేదీతో ముడిపడి ఉంటాయి. నెలంతా పడ్డ శ్రమకు ఆ రోజు జీతం రూపంలో వచ్చే ప్రతిఫలం కోసం గంపెడాశతో నిరీక్షిస్తుంటారు. అటువంటిది ఈసారి డిసెంబరు ఒకటో తేదీ అందరికీ చుక్కలు చూపించింది. ఒకటో తేదీ వచ్చిందంటే ఇంటి అద్దె మొదలుకుని కిరాణా, పాలు, పేపర్, కేబుల్‌... ఇలా అన్నింటికీ ఖర్చు చేయాలంటే జీతం చేతిలో పడాలి కదా. ప్రభుత్వం సామాజిక పింఛ¯ŒS పథకంలో ఇచ్చే వెయ్యి, రూ.1500 పైనే జీవితాలు వెళ్లదీసే పింఛ¯ŒSదారులదీ అదే పరిస్థితి. అటు ఉద్యోగులకు ఇటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సామాజిక భద్రతా పింఛన్‌దారులు.. ఇలా ఒకరేమిటి అందరినీ ఒకటో తేదీ కంగారు పెట్టించింది.

    ఉద్యోగుల ఖాతాల్లో పడని జీతాలు..

    జిల్లాలో ఉద్యోగులకు ఒకటో తేదీనాడే జీతాలు వారి ఖాతాలకు జమయ్యేవి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో గురువారం రాత్రికి కూడా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడలేదు. కొన్నిచోట్ల   ట్రెజరీల నుంచి బ్యాంకులకు జమ అయినా బ్యాంకుల్లో నగదు లేక ఇవ్వలేదు. జీతాలు జమవుతాయనడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశారు. తీరా రాత్రికి పడతాయని నిరీక్షించినా నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్‌.అండ్‌.బి, వైద్య ఆరోగ్యం, దేవాదాయశాఖ తదితర అన్ని శాఖల్లో కలిపి 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఫించ¯ŒSదారులు 40 వేల మంది ఉన్నారు. వీరితోపాటు 12,500 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ నెలకు జీతాల బడ్జెట్‌ రూ.500 కోట్లు పైమాటే. అంతెందుకు స్వయంగా జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ సహా అధికారులెవరికీ జీతాలు పడలేదు. వీరందిరికీ నేరుగా ప్రతినెలా ఒకటో తేదీన వారి వారి ఖాతాల్లో వేతనాలు జమ య్యేవి. పరిస్థితి తారుమారవడంతో ఉద్యోగవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

    పింఛ¯ŒSదారులదీ అదే వ్యథ: ఉద్యోగులతోపాటు ఫించ¯ŒSదారులు కూడా జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు పడినా ఫలితం దక్కలేదు. జిల్లాలో 4 లక్షల 75 వేల 823 మంది పింఛ¯ŒSదారులకు ప్రతినెల రూ.48 కోట్లు ఒకటో తేదీ నుంచి ఐదో తేదిలోపు నగదు ఇచ్చేవారు.వీరందరికీ రూ.100లు నోట్లు ఇవ్వాలంటే 48 లక్షల రూ.100 నోట్లు అవసరమవుతాయని లెక్కలేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ బ్యాంకర్లకు సూచించారు. కానీ అన్ని నోట్లు తమ వల్ల కాదని బ్యాంకులు చేతెలెత్తేసింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో 32 వేల మందికి నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. అధికారులు చెప్పిన మాటలతో ఏజెన్సీలో పింఛ¯ŒSదారులంతా ఎదురుచూసినా ఒక్క రూపాయి కూడా వారి చేతిలో పడలేదు.  మైదాన ప్రాంతంలో మిగిలిన 4 లక్షల 44 వేల మందికి వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తామన్నా గురువారం రాత్రికి కూడా జమకాలేదు. 

    జిల్లా కేంద్రంలో: ఉదాహరణకు కాకినాడ సిటీలో 20,732 పింఛ¯ŒSదారులకు రూ.2.30 కోట్లు ఇవ్వాలి. నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుదీరారు. నగరంలో బ్యాంకులకు ఒక్కొక్క బ్యాంకుకు రూ.25 లక్షలు వంతున మాత్రమే ఇవ్వడంతో మధ్యాహ్నానికే నగదు నిండుకుంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో 43 గ్రామ పంచాయతీల్లో పింఛ¯ŒSదారులు ఉదయం 6 గంటలకే కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఏజెన్సీలో ఖాతాల్లో పొదుపు చేసుకున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు మాత్రం రూ.4 వేలు ఇచ్చారు.  

    అంతటా ఇవే వెతలు...

    • చింతూరు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో మధ్యాహ్నానికి సొమ్ములు నిండుకున్నాయి. కూలీలకు సొమ్ములు ఎలా చెల్లించాలంటూ రైతులు వాగ్వాదానికి దిగారు.

    • పెదపూడి మండలంలో పింఛ¯ŒSదారులకు బ్యాంకుల నుంచి విడుదలైన నగదు విషయాన్ని పరిశీలిస్తే బ్యాంకుల్లో ఒకటోతేదీన నెలకున్న పరిస్థితి స్పష్టమవుతోంది. ఆ మండలంలో ఏడువేల మంది పింఛ¯ŒSదారులు ఉదయం నుంచి పడిగాపులుపడితే వీరిలో 5వేల 703 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు.

    • అమలాపురంలో ఉన్న 23 బ్యాంకుల వద్ద ఉద్యోగులు బారులు తీరడంతో క్యూలైన్లు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విశ్రాంత ఉద్యోగులు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేక అష్టకష్టాలు పడ్డారు. మొదట రూ.10వేలు ఇస్తామని చెప్పి రూ.4 వేలు, రూ.6వేలు మాత్రమే ఇవ్వడంతోశాపనార్థాలు పెట్టడం కనిపించింది.

    • రాజానగరంలో ఉదయం నుంచి బ్యాంకుల వద్ద ఉద్యోగులు, రైతులు, పింఛ¯ŒSదారులు క్యూలో నిలబడి పడిగాపులు పడ్డారు. తునిలో ఉద్యోగుల జీతాలకు రూ.10 వేలు ఇస్తామని రూ.5వేలు మాత్రమే ఇచ్చారు.

    • జగ్గంపేట స్టేట్‌బ్యాంక్‌ పరిధిలో ఎవరికీ పింఛన్లు ఇవ్వలేదు.

    • పెద్దాపురం నియోజకవర్గంలో పింఛ¯ŒSదారులకు స్టేట్‌ బ్యాంకులో రూ.4,500 మాత్రమే ఇస్తామని చివరకు ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. తాటిపాక ఆంధ్రా బ్యాంకు వద్దకు వచ్చిన ఒక వృద్దుడు సొమ్మసిల్లి పడి పోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

    • రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఎటీఎంకార్డుల కోసం, అకౌంట్ల కోసం బ్యాంకుల క్యూ కట్టారు. నగదు లేక జీతాలు ఇవ్వలేదు. ఖాతాల్లో నిల్వ ఉన్న వారికి మాత్రమే మామిడికుదురు ఎస్‌బీఐ, నగరం కార్పొరేష¯ŒS బ్యాంకు, పి.గన్నవరం ఎస్‌బీఐలలో రెండు నుంచి నాలుగువేలు ఇచ్చారు.

    • కొత్తపేట నియోజకవర్గంలో ఉద్యోగులు, పింఛ¯ŒSదారులకు కలిపి తొమ్మిదిన్నర కోట్లు వరకు బ్యాంకులకు అనుమతించారు. తీరా బ్యాంకులకు వెళ్ళినా నగదు లేక వెనుతిరిగారు. జిల్లా అంతటా ఉద్యోగులు, పింఛ¯ŒSదారులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒకటో తేదీన ముచ్చెమటలెక్కించింది.

    ప్రతిపాదనలు : జిల్లాకు రూ.500 కోట్లు అవసరం. కానీ రిజర్వు బ్యాంకుకు కేవలం రూ.300 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలను లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సుబ్రహ్మణ్యం పంపించారు. అంటే ఇవి ఉద్యోగులకు మాత్రమే సరిపోవచ్చు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని పలువురి ప్రశ్న. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top