మానభంగ పర్వంలో..మాతృహృదయ నిర్వేదం!

మానభంగ పర్వంలో..మాతృహృదయ నిర్వేదం! - Sakshi


అంకుల్ ప్లీజ్.. వదిలేయండి..

పసి మొగ్గలను చిదిమేస్తున్న మానవ మృగాలు

కామాంధుల కామానికి వాడుతున్న చిన్నారులు

పసి మొగ్గలతో పైశాచిక ఆనందం

మైనర్‌లపై లైంగిక దాడులు


ఈ దుర్యోధన.. దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బతకలేక కీచకులుగా మారి.. మర్మస్థానం కాదదీ.. మీజన్మస్థానం.. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా పుట్టి.. పశువులుగా మారితే..  సభ్యతకు.. సంస్క­ృతికి సమాధులే కడితే  కన్నులుండి చూడలేని ధ్రుతరాష్ట్ర పాలనలో..  భర్తలుండి విధ వైన ద్రౌపది ఆక్రందనలో..  ఏమై పోతోంది.. ఈ భారతదేశం.. మన భారతదేశం....


నిండా పదేళ్లు కూడా నిండని పసికూనలు వాళ్లు. కల్లాకపటం ఎరుగని మనసులు వారివి. ఆడిపాడాల్సిన చిరు దివ్వెలు. కొన్ని మానవ మృగాల చేతుల్లో చిక్కుకుని నలిగిపోతున్నారు. మేం ఏం పాపం చేశాం? మాకెందుకు ఈ నరకయాతన అంటూ..? బాధిత చిన్నారులు తమ జీవితకాలం రోదిస్తున్నారు. మానవ మృగాళ్లు కొందరు తమ కన్న కూతురికంటే తక్కువ వయసున్న  చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు, న్యాయస్థానాలు నిందితులను కఠినంగా శిక్షించాలని చూస్తున్నా చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను ఆసరా చేసుకుని వారు యథేచ్ఛగా బెరుుల్‌తో బయటకొస్తున్నారు. మొన్న ముక్కుపచ్చలారని ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి, నిన్న 11 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు పశువాంఛ తీర్చుకున్న ఘోరం, నేడు 12 ఏళ్ల బాలికపై మధమెక్కిన మృగం లైంగిక దాడి.. ఇలా రెండు నెలల వ్యధిలోనే బాలికలపై చీరాల ప్రాంతంలో లైంగిక దాడులు వరుసగా జరిగారుు. ఇటీవల మైనర్లపై పెరిగిన లైంగిక దాడులపై ‘సాక్షి’  ప్రత్యేక కథనం...


మొన్న..

ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన వేటపాలెం మండలం తీరప్రాంత గ్రామమైన పొట్టిసుబ్బయ్యపాలెంలో ఆరేళ్ల బాలికపై 29 ఏళ్ల మానవ మృగం పశువాంఛ తీర్చుకుంది. సముద్రతీర మత్స్యకార గ్రామంలో పల్లేకారి అబ్రహాం అనే యువకుడు ముక్కుపచ్చలారని ఆరేళ్ల బాలికకు తినుబండారాలు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గ్రామానికి దగ్గరలో ఉన్న సీఫుడ్స్ ఫ్యాక్టరీలో కూలి పనులు ముగించుకొని రాత్రికి ఇంటికి చేరుకున్నారు. తమ కుమార్తెపై జరిగిన అఘారుుత్యాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఆ బాలిక వీధిలో సాయంకాలం వేళ ఆరు గంటల సమయంలో ఒక్కతే అడుకుంటోంది.


పెళ్లరుు ఇద్దరు పిల్లలు తండ్రి అయిన అబ్రహం తన ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకున్నాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఇట్లోకి తీసుకెళ్లి పశువాంఛ తీర్చుకున్నాడు. ఇంటి వద్ద బాలిక ఏడుస్తూ రక్తంతో తడిసిన దుస్తులతో కనిపించింది. గమనించిన తల్లిదండ్రులు బాలికను వివరాలు అడిగారు. బిడ్డకు జరిగిన ఘోరం తెలుసుకుని బంధువులతో కలిసి తల్లిదండ్రులు నేరుగా సదరు యువకుడు పనిచేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి అతడిని తన్నుకుంటూ గ్రామానికి తీసుకొచ్చి పోలీసులకు పట్టించారు.


నిన్న

సికింద్రాబాద్ షామీర్‌పేటలోని బాలాజీ నగర్‌కు చెందిన గజ్జల దీపిక అలియాస్ పూజ తన భర్త రాజును వదిలేసి అదే ప్రాంతానికి చెందిన వేల్పుల విల్సన్‌తో సహజీవనం చే స్తోంది. పూజ కుమార్తె 11 ఏళ్ల చిన్నారిపై తండ్రి వరుసైన విల్సన్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయూన్ని బయటపెడితే చంపేస్తానని కుమార్తెను తల్లి బెదిరించింది. కొద్ది రోజుల తర్వాత పూజ, విల్సన్ కలిసి విజయవాడలోని ఓ మహిళకు కుమార్తెను అమ్మేశారు. రెండు నెలల తర్వాత విజయవాడకు చెందిన మహిళ మంగళగిరిలో వ్యభిచారం నిర్వహించే మరో మహిళకు చిన్నారిని విక్రయించింది.


మంగళగిరికి చెందిన మహిళ చీరాల జాండ్రపేట గుమ్మస్తాల కాలనీకి చెంది బోడిపాలెంలో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే అన్నపురెడ్డి సాంబ అలియాస్ ప్రేమవాణికి అమ్మేసింది. 11 ఏళ్ల చిన్నారిని కొనుగోలు చేసిన వారంతా వ్యభిచార కేంద్రాలు నడిపేవారే. బోడిపాలెంలో వ్యభిచారం నిర్వహించే అన్నపురెడ్డి ప్రేమవాణి ప్రియుడైన జయశంకర్‌నగర్‌కు చెందిన పారాబత్తిన జతిన్‌లాల్ పలుమార్లు బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు. వ్యభిచార కేంద్రం నడిపే ప్రేమవాణి వద్దకు వెళ్లే హోంగార్డు షేక్ అజీజ్‌బాషా కూడా మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో కన్న తల్లితో పాటుగా 8 మంది నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.


నేడు

పొట్టి సుబ్బయ్యపాలెం సముద్రతీర మత్స్యకార గ్రామంలో యువకుడు కోడూరి వెంకటేశ్వర్లు అలియాస్ యశోధ్ కన్ను 12 సంవత్సరాల బాలికపై పడింది. పొట్టిసుబ్బయ్యపాలెంలో గత శనివారం సాయంత్రం సదరు బాలిక తన ఇంటికి సమీపంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆదే గ్రామానికి చెందిన వివాహిత యువకుడు బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు. నిదింతునికి పెళ్లరుు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top