వారి సంఘీభావం తీసుకోవడం సిగ్గుచేటు

వారి సంఘీభావం తీసుకోవడం సిగ్గుచేటు - Sakshi


మంత్రి నారాయణ మండిపాటు



సాక్షి, విజయవాడ బ్యూరో: పదేళ్లు అధికారంలో ఉండి కూడా కాపు రిజర్వేషన్ల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతల సంఘీభావం తీసుకోవడం సిగ్గుచేటని ముద్రగడను ఉద్దేశించి మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కాపులను మోసగించేలా జీవో నంబరు 92ను ఇచ్చిందని చెప్పారు. దాళ్వాయి సుబ్రహ్మణ్యం కమిషన్ కాపు రిజర్వేషన్లపై సిఫారసులు చేసేందుకు గానూ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించేందుకు రూ.45 లక్షలు విడుదల చేయాలని కోరితే అప్పటి ప్రభుత్వం కేవలం రూ.10 లక్షలు విడుదల చేసిందన్నారు. ఆ జీవో విడుదలైనప్పుడు మంత్రులుగా ఉన్న నేతలు.. ఇప్పుడు ముద్రగడకు సంఘీభావం ఎలా తెలుపుతారని ప్రశ్నించారు.అలాగే చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజూ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదన్నారు.

 

 టెండర్లపై చర్చలు జరుపుతాం : తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి దాఖలైన టెండర్ల ఖరారు అంశం సోమవారం తేలుతుందని చెప్పారు. ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు ఎక్సెస్‌కు కోట్ చేశాయని వారితో సోమవారం చర్చలు జరిపి తాము నిర్దేశించిన రేటుకే పనులు చేపట్టాలని కోరతామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top