ప్రాజెక్టులను అడ్డుకుంటే పాతరేయండి

ప్రాజెక్టులను అడ్డుకుంటే పాతరేయండి - Sakshi


- నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు

- కాంగ్రెస్, టీడీపీలే అడ్డుకుంటున్నాయని ఆరోపణ

- మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి తీరుతాం

 

 సాక్షి, మెదక్: సాగునీటి ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే వారిని కాల్వల్లో పాతర వేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ పట్ట ణం, నిజాంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామాయంపేట మండలం నిజాంపే టలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలపై తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేసేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్నసాగర్, కాళేశ్వ రం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ నుంచి మెదక్ జిల్లాకు సాగునీరు తీసుకువచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. మూడవ విడత మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల పనులు చేపట్టను న్నట్లు చెప్పారు.



అలాగే చెరువుల కట్టకా ల్వలను ఆధునీకరిస్తామని వివరించారు. రైతులు కరెంటోళ్లకు ఒక్క రూపారుు కూడా లంచం ఇవ్వద్దని కోరారు. సీఎం కేసీఆర్ కరెంటు కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్‌‌సఫార్మర్లను రైతులు కోరిన చోట ఉచితంగా బిగించనున్నట్లు చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల కాపర్ల కోసం ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గొర్రెల కాపర్లు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏడాది గొర్రెల కాపర్ల సంక్షేమం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top