నంద్యాలలో మినీ నంది నాటకోత్సవం

నంద్యాలలో మినీ నంది నాటకోత్సవం


– 27 నుంచి ప్రారంభం

– బ్రోచర్లు విడుదల


నంద్యాల: రాష్ట్ర చలన చిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) సహకారంతో స్థానిక మున్సిపల్‌ టౌన్‌హాల్‌లో ఈ నెల 27 నుండి 29 వరకు మినీ నందినాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కళారాధన అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవికృష్ణ తెలిపారు. స్థానిక మధుమణి కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డు సాధించిన కళాకారులకు సన్మానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో లయన్స్‌ క్లబ్, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు భవనాశి మహేష్, రమేష్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రసాద్, రవిప్రకాష్, పెసల శ్రీకాంత్, కరీముద్దీన్‌ అలియాస్‌ చందన్‌ పాల్గొన్నారు.



27వ తేదీ:  బంగారు నంది అవార్డు సాధించిన నాటకం జీవితార్థంను గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్‌ సంస్థ కళాకారులు ప్రదర్శిస్తారు.

28వతేదీ: బంగారు నంది అవార్డు పొందిన బాలల సాంఘిక నాటకాన్ని గురురాజ కాన్సెప్ట్‌ స్కూల్, కళారాధన ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శిస్తారు.

             డాక్టర్‌ రామన్‌ ఫౌండేషన్‌ వారి చారిత్రాత్మక పద్యనాటకం, కళారాధన రూపొందించిన సైకత శిల్పం సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తారు.

            ప్రముఖ వైద్యుడు చిత్తలూరి మధుసూదనరావుకు మదర్‌థెరిసా జీవిత కాల సేవ పురస్కారం ప్రదానం చేస్తారు.

          నెల్లూరుకు చెందిన జ్ఞాన నేత్ర సంఘం అంధుల సంగీత విభావరి ఉంటుంది.  

28వ తేదీ:  జాతీయ క్రీడాదినోత్సవం, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళం ఏర్పాటు. అనంతరం కవుల సన్మానం.

          ఆయుర్వేద వైద్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మకు కళారాధన ఆత్మీయ సత్కారం ఉంటుంది.

        రంగస్థల నటుడు గోపిశెట్టి వెంకటేశ్వర్, పౌరాణిక నటుడు రంగారెడ్డికి పురస్కార ప్రదానం.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top