సైనికుల త్యాగాలు మరువలేనివి

సైనికుల త్యాగాలు మరువలేనివి


అమర జవాన్  విగ్రహాన్ని

ఆవిష్కరించిన మంత్రి ఈటలకమలాపూర్‌(హుజురాబాద్‌) : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా సేవచేస్తున్న సైనికులను, దేశం కోసం చేమటోడ్చుతున్న రైతన్నను మనం గౌరవించుకోవాలన్నారు. కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన కూస కరుణాకర్‌ ఆర్మీలో పని చేస్తూ గతేడాది పాముకాటుకు గురై మృతి చెందగా శుక్రవారం మర్రిపల్లిగూడెంలో ఆయన ప్రథమ వర్ధంతి నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కరుణాకర్‌ విగ్రహాన్ని మంత్రి ఈటల ఆవిష్కరించి మాట్లాడారు.


దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సైనికులకు తగిన గౌరవం కల్పిస్తోందన్నారు. గతంలో సైన్యంలోకి వెళ్లేందుకు యువత వెనుకాడేవారని, ఇప్పటి యువతలో చాలా మార్పువచ్చిందని, దేశం కోసం ఆర్మీలో చేరేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారన్నారు. కరుణాకర్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సిన సహాయం ఇప్పటి వరకు ఇవ్వలేదని మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  


గ్రామానికి చెందిన సైనికుల ఆధ్వర్యంలో 15 మంది పేదలకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు.   ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ నవీన్ మార్, పీఏసీఎస్‌ చైర్మన్  సంపత్‌రావు, సర్పంచ్‌ పొరండ్ల రజని, ఎంపీటీసీ కవిత, జమ్మికుంట నగర పంచాయతీ చైర్మన్  రామస్వామి, ఏఎంసీ చైర్మన్ శ్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం వరంగల్, కరీంనగర్‌ జిల్లాల అధ్యక్షులు ప్రభాకర్, రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అయిలయ్య, మోహన్, సంపత్, వెంకట్‌రెడ్డి, గ్యాలంటరీ అవార్డు గ్రహీత మల్లయ్య, జవాన్లు రావుల మహేశ్, కాసూరి తిరుపతి, దువ్వ రాజు, కరుణాకర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top