సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌


సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా.. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది. వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, నేత కార్మికుల దీర్ఘకాలిక ఉపాధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ క్లస్టర్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సిరిసిల్ల ఎమ్మెల్యే, పరిశ్ర మల శాఖ మంత్రి కె.తారకరామారావు బుధ వారం ఢిల్లీ వెళ్లి మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పా టుకు సమగ్ర నివేదిక అందించారు. రూ.250 కోట్ల ప్రణాళికతో ఏర్పాటు చేసే ఈ క్లస్టర్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్‌ కోరారు.



300 ఎకరాల్లో పారిశ్రామిక అభివృద్ధి..

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల, చిన్న బోనాల, పెద్దూరు, సర్దాపూర్, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లె శివారుల్లో వెయ్యి ఎకరాల ప్రభు త్వ భూములు ఉన్నాయి. ఇందులో 300 ఎకరాల్లో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ (ఇంటి గ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌)ను ఏర్పాటు చేయా లని ప్రతిపాదించారు. పారదర్శకంగా భూము లు కేటాయించి తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియ ల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఐఐసీ) ద్వారా స్థలాలు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని ప్రతిపాదిం చారు. పత్తి నుంచి దారం, వస్త్రం, ప్రాసెసింగ్, ఆధునిక దుస్తుల తయారీ మొదలు గార్మెంట్‌ వరకు అన్నిరకాల పరిశ్రమలను నెలకొల్పా లని నిర్ణయించారు. సిరిసిల్ల నుంచి డ్రెస్సుల ను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వస్త్రోత్పత్తి రంగాన్ని విస్తరించనున్నారు.  



మేడిన్‌ సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌..

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఆధునీకరణకు తెలంగాణ టెక్స్‌టైల్‌ పాలసీ(టీ–టాప్‌)ని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధి కంగా 34 వేల మరమగ్గాలు సిరిసిల్లలో ఉన్నాయి.  టెక్స్‌టైల్‌ అభివృద్ధికి రూ.250 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులకు నిర్దేశించారు.  వస్త్రోత్పత్తి రం గంలో వస్తున్న ఆధునికమార్పులకు అను గు ణంగా సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పరిశోధన కేం ద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top