కోస్తాలో భారీ వర్షాలు.. భయం గుప్పిట్లో జనం


చిత్తూరు: నైరుతి బంగాళా ఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తా అంతటా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.



మరోపక్క, అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. కేవీబీపురం, కాళహస్తి, ఏర్పేడు, సత్యవేడులో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. స్వర్ణముఖి నది పొంగిపొర్లుతుంది. లోతట్టుప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లోకి జారుకున్నారు. అలాగే, నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల కారణంగా చెన్నై-విజయవాడ మార్గంలో ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top