కాపులను బీసీల్లో చేర్చే దమ్ముందా?

కాపులను బీసీల్లో చేర్చే దమ్ముందా? - Sakshi


ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ

 

 విజయవాడ : ‘మంజునాథ కమిషన్ గడువులోగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. బీసీల్లో చేర్చేందుకు కమిషన్ అంగీకరిస్తే కేంద్రం మద్దతు లేకుండా, పార్లమెంట్ ఆమోదం పొందకుండా సొంతంగా కాపులను బీసీల్లో చేర్చే దమ్ము చంద్రబాబుకు ఉందా?’ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నిలదీశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు వారిని మభ్యపెట్టేందుకేనన్నారు. ఇదే సూత్రం మాలమాదిగలకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.



గతంలో చంద్రబాబు నియమించిన రామచంద్రన్ కమిషన్ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. మభ్యపెట్టడం, మోసంచేయడం చంద్రబాబుకు అలవాటని, ‘చంద్రబాబు పచ్చి మోసగాడు. నెం.1 విశ్వాస ఘాతకుడు. నమ్మక ద్రోహి’ అని త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు పౌరహక్కులు ఉల్లంఘించారనడానికి కాపు నేతలపై పెట్టిన కేసులే సాక్ష్యమమన్నారు. ముందస్తు సమాచారం ఉంటే తుని ఘటనలో ఇంత విధ్వంసం జరిగేది కాదని ఓ వైపు పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులను హెచ్చరిస్తూనే.. ఇది జగన్ కుట్ర అని నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఏ ఆధారంతో విపక్ష నేత జగన్‌పై విమర్శలు చేశారో వెల్లడించాలని,  సీఎం హోదాలో ఉండి ప్రతిపక్ష నాయకుడిపై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ ఆయన డిమాండ్‌చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top