మానవసేవే ‘మాధవ’ సేవ

మానవసేవే ‘మాధవ’  సేవ

 తణుకు అర్బన్‌ : ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సూక్తిని నిజం చేస్తున్నారు తణుకు మురారి యూత్‌ సభ్యులు. మొదట్లో ఏటా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరిపేందుకు ఏర్పాటైన ఈ యూత్‌ కాలక్రమంలో సమాజ సేవ చేయడం ప్రారంభించారు. ఆ మాధవుడిపై ఉన్న అభిమానంతోనే తమ సంస్థకు మురారి అని పేరు పెట్టుకున్నారు. సుమారు 24 ఏళ్లుగా తణుకు పాతవూరులోని ఇందుకూరి వారి వీధి మహోత్సవాలతో పాటు 12 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను ఈ యూత్‌ నిర్వహిస్తోంది. ఏటా కష్ణాష్టమి రోజున వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు, వృద్ధాశ్రమాల్లో భోజన వసతి కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఏటా 10 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై  సైకిళ్లు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువారం కష్ణాష్టమి కావడంతో సేవా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. 

మురారి యూత్‌ కార్యవర్గం ఇదే.. 

గౌరవ అ«ధ్యక్షుడిగా బొల్లా సతీష్‌కుమార్, అధ్యక్షుడిగా సీహెచ్‌ సంజీవి, కార్యదర్శిగా తణుకు జగదీష్, కోశాధికారిగా బి.నాని, ఎ.లతీఫ్,  బి.ప్రసన్న, ప్రసాద్, వాసు, బాబి, పి.కల్యాణ్, పి.చాణక్య, శ్రీను, వంశీ సభ్యులుగా ఉన్నారు. 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top