యూనివర్సిటీ సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్తా


నల్లగొండ రూరల్‌ : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్తానని సీఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం యూనివర్సిటీలో సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్‌ వద్ద పట్టుబట్టి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చానన్నారు. సమీప జిల్లాల వారికి ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో కృషి చేయడంతో యూనివర్సిటీకి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారన్నారు. యూనివర్సిటీలోని సమస్యలను డిప్యూటీ సీఎంకు దృష్టికి తీసుకెళ్తామని వస్తే గ్రంథాలయం వద్ద ఆయనను కలిసేందుకు వెళ్తుండగా నేర చరిత్ర కలిగిన వారు, పార్టీ మారిన వారు, సొంత గ్రామంలో వార్డు మెంబర్‌గా గెలవలేని వారు నాకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారన్నా రు. ఈ విషయంపై డీజీపీని కలుస్తానన్నారు. సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. మా పార్టీ కార్యకర్తలు కోమటిరెడ్డి జిందాబాద్‌ అన్నారే తప్ప ఇతర ప్రజా ప్రజా ప్రతి నిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదన్నారు.పోలీసులను అడ్డుపెట్టుకొని గొడవ చేసేందుకు ప్రయత్నించారన్నారు.



శానిటరీ ఉద్యోగుల వేతనాలు పెంచాలి

శానిటరీ ఉద్యోగులకు నెలకు నాలుగు వేలు ఇస్తే ఎలా సరిపోతుంది... వీసీ గారు.. మీ ఇంట్లో పనిచేసేవారికి ఎంత వేతనం ఇస్తారు... వచ్చే నెల నుంచి నెలకు 10 వేలు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీసీకీ సూచించారు. సెమినార్‌ హాల్‌లో యూనివర్సిటీ వీసీ, రిజిస్టార్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఉద్యోగులు జీతాలు సరిపోవడం లేదని కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి మున్సిపల్‌ శానిటరీ ఉద్యోగులకు కూడా 10 వేలు జీతం ఇస్తున్నారని వీరికి కూడా జీతాలు పెంచాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top