ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం


విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి బుధవారం ఉదయానికి గా మారింది. తొలుత అంచనా వేసినట్టుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో కాకుండా, ఏర్పడడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా బలపడి వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలమైన అల్పపీడనంగా మారవచ్చని దీని ప్రభావం.. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో కొంతవరకు ప్రభావం చూపవచ్చని వాతావరణం నిపుణులు చెబుతున్నారు.



రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో తిరుపతిలో 6, పాలసముద్రంలో 5, తనకల్‌లో 4, రుద్రవరం, చిన్నమాడెం, జమ్మలమడుగు, ఆలూరుల్లో 3, పెనుకొండ, రాజంపేట, పుత్తూరు, పుల్లంపేట, కంబదూరు, పలమనేరు, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పాడేరుల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top