లోవకు రూ.1.51 కోట్ల ఆదాయం

లోవకు రూ.1.51 కోట్ల ఆదాయం

- నాలుగు అంశాలు వాయిదా

- ఈఓ చంద్రశేఖర్‌

తుని రూరల్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి వివిధ హక్కులకు నిర్వహించిన వేలం ద్వారా రూ.కోటి, 51 లక్షల 11 వేల 792ల ఆదాయం లభించిందని అసిస్టెంట్‌ కమిషనర్, ఈఓ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. దేవస్థానంలో తల నీలాలు పొగు చేసుకోవడ, వివిధ వస్తువులు విక్రయానికి శనివారం టెండర్‌ కం బహిరంగా వేలం నిర్వహించారు. టోల్‌గేట్, శీతలపానియాలు, క్యాంటీన్‌ నిర్వహణ, పాలు, పెరుగు విక్రయాల హక్కులకు ఎవరు ఆసక్తి చూపకపోవడంతో వాయిదా వేశారు. నెలకు తలనీలాలు పొగు చేసుకునేందుకు రూ.3.39 లక్షలు, పూజా సామగ్రి, కొబ్బరి కాయలు విక్రయానికి రూ.3,34,200, వస్త్రాల విక్రయానికి రూ.3.54 లక్షలు, యంత్రాలు, ఫ్యాన్సీ సామాన్లు విక్రయానికి రూ.93,100, అమ్మవారి ఫోటోలు అమ్మకానికి రూ.66,116, భక్తులు ఫొటోలు తీసి విక్రయించేందుకు రూ.55 వేలు, తోపుడు బళ్లపై సామాన్లు విక్రయానికి రూ.11,300, చెప్పుల స్టాండు నిర్వహణకు రూ.12,600కు వేలంను ఖరారు చేశారు. నెలకు వీటి మొత్తం రూ.12 లక్షల 59 వేల 316లు కాగా ఏడాదికి రూ.1.51 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఈఓ వివరించారు. చైర్మన్‌ కరపా అప్పారావు, పిఠాపురం ఈఓ చందక ధారబాబు, సూపరింటెండెంట్లు కేవీ రమణ, ఎల్‌వీ రమణ, ధర్మకర్తలు, ఉద్యోగులు, పలువురు పాటదారులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top