స్థానిక బలం టీఆర్‌ఎస్‌కే


ఎమ్మెల్సీకి ఓటేసే సభ్యుల్లో  ఆ పార్టీవారే అధికం

టికెట్ కోసం  నేతల ముమ్మర ప్రయత్నం

ఎన్నికలో పోటీకి సుముఖంగా లేని విపక్షాలు


 

వరంగల్ :జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక హడావుడి మొదలైంది. వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి ఊపుమీదున్న టీఆర్‌ఎస్.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కూడా తమదేననే ధీమాతో  ఉంది. ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక లో కాంగ్రెస్, బీజేపీ పోటీ చేసే పరిస్థితి లేదని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకునే ఓటర్ల జాబితాను పరిశీలిస్తే... అధికార టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత కనిపిస్తోంది. దీంతో టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ టికెట్ కోసం డిమాండ్ ఎక్కువగానే ఉంది. టికె ట్ దక్కితే గెలుపు సులభమనే భావనలో ఉన్న ఆ పార్టీ నేతలు టికెట్ కోసం ఎవరికి వారు తీ వ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో మొద టి నుంచి పనిచేసిన పలువురు కీలక నేతలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్ సైతం కొత్తగా పార్టీలో చేరిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు కూడా కొత్త వారికే దక్కాయి. మారిన రాజకీయ పరిణామాలతో కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీలు అయ్యా రు.



ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయం లో తమకే అవకాశం వస్తుందని టీఆర్‌ఎస్‌లో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న నేతలు భావి స్తున్నారు. దీనిని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ఆశిస్తున్నారు. గతంలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలో పోటీ చేసిన ఎస్సార్ విద్యాసంస్థల అధినేత, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎ.వరదారెడ్డి సైతం టీఆర్‌ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సురేఖ దం పతులు గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. దీంతో మాజీ ఎమ్మె ల్సీ కొండా మురళీధర్‌రావుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని టీ ఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అరుు తే, పాతవారికి టికెట్ వస్తుందా... లేక టీఆర్‌ఎస్‌లో సంప్రదాయం ప్రకారం కొత్త వారికి అవకాశం వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి పెద్దగా స్పం దన కనిపించడం లేదు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలతో నైరాశ్యంలో ఉన్న ఈ పార్టీ లు ఎమ్మెల్సీ ఎన్నిక విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీగా పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి వస్తే కాంగ్రెస్ నుంచి మాత్రం అభ్యర్థి బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ పార్టీలో పోటీ చేసేందుకు ప్రస్తుతానికి ఎవ రూ ముందుకు రావడంలేదు. అధిష్టానం ఆదేశిస్తే ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.



స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి.. ఎక్స్‌అఫీషియో సభ్యులు (ఎమ్మెల్యే లు), జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు ఉండదని అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయాలని ఆప్షన్ ఇచ్చిన శాసనసభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యు లు, మున్సిపాలిటీ, నగరపంచాయతీ కౌన్సిలర్లు... గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థలోని 58 డివిజన్ల కార్పొరేటర్లు కలిపి మొత్తం 937 మంది ఓటర్లు ఉంటారు. అరుుతే.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనందున అక్కడ కార్పొరేటర్లు లేరు. అదేవిధంగా ఏజెన్సీ విషయంలో న్యాయ వివాదం కారణం గా మంగపేట మండలంలో 14 మంది ఎంపీటీసీలు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. దీం తో హన్మకొండ మండలంలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు న్యాయ వివాదం కారణంగా ఇం కా ప్రమాణం చేయలేదు. జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవి మృతి కారణంగా ఈ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం 688 ఎంపీటీసీ సభ్యులకు ఓటు హక్కు ఉంది. మొత్తంగా ఎక్స్‌అఫీషియో సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు కలిపి మొత్తం 862 మంది ఓటర్లు ఉన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top