మినీ మహానాడు పద్ధతి ప్రకారం జరగలేదు: కరణం బలరాం


ఒంగోలు: టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో గొడవపై ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం వివరణ ఇచ్చారు. మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. మినీ మహానాడు ఓ పద్ధతి ప్రకారం జరగలేదని వ్యాఖ్యానించారు. తనతో సహా చాలా మంది సీనియర్ నేతలు, పరిశీలకులు సమావేశం జరిగే హాలులో 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంత సమయం ఎదురుచూసినా సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు రాకపోవడం అవమానకరమని కరణం బలరాం అభిప్రాయపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోకముందే తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వివరించారు. అందుకే ఆ ఎమ్మెల్యే టీడీపీలో చేరేరోజు తాను వెళ్లలేదని, అధిష్టానానికి తన కమిట్ మెంట్, క్రమశిక్షణ గురించి తెలుసునని మాట్లాడారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top