కంచనపల్లిని మండలం చేయాలి


  • ఎనమిది గ్రామ పంచాయతీల తీర్మానం

  • రఘునాథపల్లి :  మండలంలోని కంచనపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం కలెక్టర్‌ వాకాటి కరుణ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భూ పరిపాలన శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రేమండ్‌ పీటర్‌లకుS గ్రామస్తులు వినతి పత్రం అందించారు. హన్మకొండలో కలెక్టర్‌ను, హైదరాబాద్‌లో కడియం శ్రీహరి, రేమండ్‌ పీటర్‌లను కలిశారు. అన్ని సౌకర్యాలు గల కంచనపల్లిని మండల కేంద్రం చేయాలని కోరారు. భానాజీపేట, కన్నాయపల్లి, గబ్బెట, కోడూర్, రామన్నగూడెం, కుర్చపల్లి, కోమటిగూడెం, కంచనపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని పేర్కొన్నారు.

     

    అలాగే కోమల్ల, గోవర్దనగిరి గ్రామాలు కూడా దీనిపై సుముఖంగా ఉన్నాయని తెలిపారు. 10 గ్రామాలలో 38,742 జనాభా ఉన్నారని వివరించారు. కలెక్టర్, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, రేమండ్‌ పీటర్‌ తమ వినతుల పట్ల సానుకూలంగా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. వినతిపత్రాలు ఇచ్చిన వారిలో ఆయా గ్రామాలకు చెందిన లోనె ఇందిర, గుండె యమున, లోనె రవీందర్, గొంగళ్ల సోమయ్య, కారంపొడి వెంకటనర్సయ్య, దైద ప్రభాకర్, గుండె జోసఫ్, ప్యారపు రాములు, కొలిపాక మల్లేశం, గాదె కుమార్, కందుకూరి యాదగిరి ఉన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top