'ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ నాటికి సొంత ఇల్లు కలిగి ఉండేటట్లు చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత'

Advertisement

న్యూస్ ఫ్లాష్ టిడిపికి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా Share on:
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకథ

వ్యాధులకు మందుల కంపెనీలదే బాధ్యత

Sakshi | Updated: May 20, 2013 00:14 (IST)
India :పటమట, న్యూస్‌లైన్ : మందుల వలన వినియోగదారులు వ్యాధుల బారిన పడితే దానికి వాటిని తయారు చేసిన కంపెనీలపైనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య పేర్కొన్నారు. కృష్ణాజిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 68వ వార్షికోత్సవం బెంజ్‌సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎమ్మెల్యేలు మల్లాదివిష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ వినియోగదారులు మందులు షాపులలో కొనుగోలు చేసినంత మాత్రాన షాపుల యాజమానులు బాధ్యులు కారన్నారు. అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రావ్ మాట్లాడుతూ మెడికల్ షాపుల యజమానులకు కేంద్ర ప్రభుత్వంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మెడికల్ షాపులో పనిచేసే ఫార్మాసిస్టులు 10వ తరగతి నుంచి ఫార్మసీ చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. జనరిక్ మందులలో కూడా లాభశాతాన్ని నిర్ణయించాలన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రసంగించారు. అనంతరం అసోసియేషన్ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అసోసియేషన్ ప్రతినిధులు పుల్లయ్య, శ్రీరామ్‌మూర్తి, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు జీవని, నాగరాజు, బాలు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

'జనధన యోజన'కు శ్రీకారం

Advertisement

Most Viewed

నెహ్రూ కుటుంబం హవా

సొంత ఆలోచనలు లేని నమ్మినబంటులనే కాంగ్రెస్ అధిష్టానం సిఎంలుగా ఎంపిక చేస్తుంది.

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.