పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం - Sakshi


 గ్రావు పంచాయుతీల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పారదర్శకంగా జరగాలి.


 మేడ్చల్ రూరల్ : ‘పన్నుల విధింపు, ఆస్తి విలువ లెక్కింపు తదితర అంశాలపై అవగాహన లేకుంటే ఎలా..? సాధారణ అంశాలపై కనీస అవగాహన  లేకుంటే ఎలా.. గ్రామాధికారులుగా మీరేం చేస్తున్నా రు..’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బిల్‌కలెక్టర్, గ్రామకార్యదర్శిలకు చురకలంటించారు. శని వారం ఆయన మండలంలోని ఎల్లంపే ట్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయుతీ కార్యాల యుంలో రికార్డులు పరిశీలించారు.


గ్రా వుంలో ఎన్ని కుటుంబాలు ఉన్నారుు? వంద శాతం వురుగుదొడ్లు ఉన్నాయూ? లేవా? పన్నులు వసూలు ఏవిధంగా ఉంది? తదితర అంశాలపై బిల్‌కలెక్టర్ తిరుపతిరెడ్డి, కార్యదర్శి నరసింహులను మంత్రి ప్రశ్నించారు. ఇందుకు వారు సమాధానమిస్తూ 90 కుటుంబాలు మ రుగుదొడ్లు లేవని చెప్పడంతో.. ‘గ్రామ అధికారులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారు..? వంద శాతం పూర్తి చేసే బాధ్యత మీదే’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రి కార్డులను పరిశీలిస్తుండగా.. గ్రావు పరిధిలోని ఆర్‌కే డిస్టిలర్స్ కంపెనీ పన్ను బకారుు ఉన్నట్లు తేలడంతో ఇంత వ రకు ఎందుకు వారి నుంచి పన్ను వసూ లు చేయలేదని ప్రశ్నించారు.


ఇం దుకు వారి నుంచి సమాధానం రాకపోవడం తో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసిన పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం శానిటేషన్‌పై సమీక్షించారు. అనంతరం గ్రామం లో ఏవైనా సమస్యలున్నాయా.. అంటూ  సర్పంచ్ చిన్నలింగం, ఎంపీటీసీ సభ్యురాలు రేణుకలను ప్రశ్నించారు. కాగా.. గ్రావుంలో నీటి సవుస్య తీవ్రంగా ఉం దని తెలుపగా సవుస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్యదర్శి న ర్సింహ, బిల్‌కలెక్టర్ తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు కువూర్‌లు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top