ఒక్క క్లిక్‌తో ఉద్యోగసమాచారం

ఒక్క క్లిక్‌తో ఉద్యోగసమాచారం


ఉద్యోగ కల్పనకు అనువైనవేదిక ‘ఎన్సీఎస్‌’

ఎక్కడ ఖాళీలున్నా సెల్‌కు  మెసేజ్‌

కేంద్ర ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌  




కడప కోటిరెడ్డి సర్కిల్‌ :

ఎక్కడ ఖాళీలున్నాయో తెలియక కార్యాలయాల చుట్టు ఉద్యోగాల కోసం తిరుగుతున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ కెరియర్‌ సర్వీస్‌ (ఎన్సీఎస్‌) పోర్టల్‌ చక్కటి మార్గదర్శకం కానుంది. ఇక నుంచి ఉద్యోగాలు ఈ ఎన్సీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారానే కల్పించాలని కేంద్రం భావిస్తోంది. నిరుద్యోగులు తప్పనిసరిగా ఎన్సీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తున్న విషయం తెలి సిందే. ఈ ఎన్సీఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తున్నారు.  



కేటాయించే యూఐడీ కీలకం:

ఈ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న యువతకు తమ వ్యక్తిగత ఈ మెయిల్‌గానే యూఐడీ కేటాయిస్తారు.  ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ రంగాల్లోని కంపెనీలు నిర్వహిస్తున్న ఉద్యోగ మేళ  వివరాలన్ని ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఉపాధి కల్పనా కార్యాలయం నుంచి జరిగే ఉద్యోగాల ఎంపికల్లో ఎన్సీఎస్‌ పోర్టల్‌లలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.



 రిన్ని వివరాల కోసం

వెబ్‌సైట్‌ కింది కాలంలో కనిపించే యూజర్‌  మాన్యువల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తెలుసుకోవచ్చు. టోల్‌ ఫ్రి నెంబర్‌ 1800 425 1514 నంబర్‌కు ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకు  ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు డయల్‌ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.



వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ఇలా..

ఠీఠీఠీ. nఛిట.జౌఠి.జీ n వె»Œ సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. కనిపించే వెబ్‌సైట్‌ ముఖ చిత్రంలో హోం పక్కన జాబ్‌సీకర్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్‌ తెరుచుకుంటుంది.అందులోకి వెళ్లి న్యూ యూజర్‌ తర్వాత సైనాఫ్‌ క్లిక్‌ చేస్తే  మీ వివరాలు నమోదు చేసుకున్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు కనిపిస్తుంది. కనిపించే విండో లో నాన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ , స్కిల్‌ ప్రొవైడింగ్‌ ఇన్సిట్యూట్‌ కాలంలో నన్‌ కాలం క్లిక్‌ చేయాలి. 10వ తరగతి మార్కుల్‌ జాబితా ఆధారంగా అభ్యర్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వివరాలు, అభ్యర్థి విద్యార్హత, ఈ మెయిల్‌ ఐడి, మొబైల్‌ వివరాలు నమోదు చేయాలి. అక్కడే 8 అంకెల పాస్‌వర్డు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ వస్తుంది. అందులో ఆధార్‌ కార్డు ఎంపిక చేసుకోవాలి.



ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయగానే యూజర్‌ ఐడీ ఆప్షన్‌ వస్తుంది. అందులో ఆధార్‌ సంఖ్య ఎంపిక చేయగానే అభ్యర్థి పేరు, పోర్టల్లో నమోదవుతుంది. అభ్యర్థి తనకు ఎలాంటి ఉద్యోగం కావాలి,  విద్యార్థతలు, తదితర సమాచారం నమోదు చేయాలి. తర్వాత కాలంలో సెక్యూరిటీ కోడ్స్‌ చూపిస్తుంది. ఈ కోడ్‌ను సబ్మిట్‌ చేయగానే ఎన్సీఎస్‌ పోర్టల్లో దరఖాస్తు స్వీకరించినట్లు యూజర్‌ ఐడీ వస్తుంది. వెంటనే అభ్యర్థి మొబైల్‌కు ఆరు అంకెల వన్‌టైం పాస్వర్డ్‌  వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేయగానే 19 అంకెలతో ఎన్‌సీఎస్‌ యూఐడీ నెంబరు నమోదవుతుంది. 24 గంటల తర్వాత ఎన్‌సీఎస్‌ Ððవెబ్‌ పోర్టల్‌లలో అభ్యర్థికి కేటాయించిన యూఐడీ వినియోగంలోకి వస్తుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top