పేదల పాలిట వరం కళ్యాణలక్ష్మి

పేదల పాలిట వరం కళ్యాణలక్ష్మి - Sakshi


జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

పలువురికి కళ్యాణలక్ష్మి, రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత




జనగామ : రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే భావనతోనే సీఎం కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్డీఓ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బచ్చన్నపేట, జనగామ టౌన్, రూరల్‌ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు పలువురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను యాదగిరిరెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం ఆలోచిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు చెన్నయ్య, విజయభాస్కర్, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బండ పద్మ, ఎంపీపీ  బైరగోని యాదగరి, పస్తం మహేష్, జెడ్పీటీసీలు బాల్దె విజయ, వేముల స్వప్నతో పాటు నాగారపు వెంకట్, ఎండీ.అన్వర్, కొణ్యాల జనార్దన్‌రెడ్డి, దేవరాయ ఎల్లయ్య, కన్నారపు ఉపేందర్, మేడ శ్రీనివాస్, వెన్నెం శ్రీల త, గజ్జెల నర్సిరెడ్డి, వేమెళ్ల పద్మ, ఎజాజ్, బండ యాదగిరిరెడ్డి, బాల్దె సిద్దులు,   కలింగరాజు, నల్లగోని బాలకిషన్, ఇర్రి రమనారెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, వడ్డెపల్లి మల్లారెడ్డి, కనకయ్య, కొండయ్య, చొక్కం నర్సింహులు, వేముల విద్యాసాగర్, జావీద్, షబ్బీర్, వీఆర్వో రమేష్‌ ఉన్నారు.



పెళ్లి రోజే  కళ్యాణలక్ష్మి కానుక : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..

రఘునాథపల్లి/ లింగాల ఘణపురం (స్టేషన్‌ఘన్‌పూర్‌) : ఇక నుంచి పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కా ర్యాలయంలో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న 49 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ పోటోలు అమ్మాయి తరపు పెద్దల సంతకాలతో తహసీల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ముహుర్తం నాటికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేస్తామన్నారు. కాగా, కళ్యాణలక్ష్మి పథకంలో ధరఖాస్తు చేసుకున్న పలువురు ఎస్టీలకు చెక్కులు మంజూరు కాకపోవడం పట్ల ఆ వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తి  వ్యక్తం చేశారు. అలాగే, లింగాలఘణపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో 55 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజయ్య చెక్కు లు అందజేసి మాట్లాడారు.



కార్యక్రమాల్లో జెడ్పీటీసీలు బానోతు శారద, రంజిత్‌రెడ్డి, తహసీల్దార్లు కె.నారాయణ, రాజేందర్, ఎంపీపీ దాసరి అనిత, ఎంపీడీఓలు బానోతు సరిత, రవితో పాటు మల్కపురం లక్ష్మయ్య, రా జేందర్, సూర్య, జ్యోతి, రంజిత్, సుధాకర్, రాములు, శ్రీహరి, కొంరయ్య, నర్సింహ్మ, నాగేశ్వర్, యమున, రమాదేవి, స్వర్ణలత, కుమార్, పెండ్లి మల్లారెడ్డి, దొంగ అంజిరెడ్డి, సత్యనారాయణ, వెంకటయ్య, రాంబాబు, చెంచు రమేష్, లక్ష్మీనారాయణ, యాదయ్య, శ్రీనువాస్, మల్లారెడ్డి, సోమయ్య, విజయ్‌భాస్కర్, మదార్, స త్తమ్మ, మధు, రేగు అంజయ్య, చిట్ల ఉపేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, భాగ్యలక్ష్మి, మోహన్, రాజు పాల్గొన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top