బోధకుల బాధలు..!


అక్షరాలతో ఆనకట్టలు కట్టిస్తారు.. భవంతుల నిర్మాణం నేర్పిస్తారు.. మనుషులకు ప్రాణం ఎలా పోయూలో.. చావుబతుకుల్లో ఉండేవారిని ఎలా బతికించాలో కళ్లకు కట్టి చూపిస్తారు. ఏది న్యాయం.. ఏది అన్యాయమో చెప్పే న్యాయమూర్తులను సృష్టిస్తారు. మనిషిలో నైతిక విలువలు ఎలా ఉండాలో.. అసలు జనం ఎలా బతకాలో నేర్పిస్తారు. సమాజ ఆర్కిటెక్ట్‌లుగా.. దైవాంస సంభూతులుగా మనం గౌరవించుకొనే గురువులు నేడు అన్నం కోసం అలమటిస్తున్నారు. అందరి కంచాల్లో రుచికరమైన వంటలు ఉండేలా ఆశీర్వదించిన వారు నేడు ఖాళీ కంచాల్లో కన్నీటి బొట్లు రాల్చుతున్నారు. ఐటీఐ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను నేటి ప్రభుత్వం మానసికంగా వేధిస్తోంది. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు..  గురు దేవో మహేశ్వరః’ ఇది కేవలం పుస్తకాలకే పరిమితమా?  - కందుకూరు రూరల్

 

 

‘నిత్యం విద్యార్థుల అభ్యున్నతి కోసం శ్రమించే మా గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రెగ్యులర్ చేయకపోయినా పర్వాలేదు. ఉన్న ఉద్యోగం ఊడగొట్టకుండా నెలనెలా జీతం ఇస్తే చాలు’

- ఐటీఐ కళాశాల కాంట్రాక్ట్ ఉద్యోగులు


 

టీడీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోరుుంది. ఓ వైపు ఉన్న ఉద్యోగులను వరుసగా తొలగిస్తుంటే.. మరో వైపు ఉన్నవారికి సంవత్సరాల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్క నెల జీతం అందకుంటేనే విలవిల్లాడే ఉద్యోగులు.. నెలల తరబడి జీతాలు లేకపోతే ఎలా ఉంటుందో ప్రభుత్వానికి అర్థం కాకపోవడం శోచనీయం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇలాంటి ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న బాబు మాటలు నమ్మూతూ ఇంకా ఊడిగం చేస్తూనే ఉన్నారు.

 

నాలుగు కళాశాలలు

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కాంట్రాక్టర్ పద్ధతిన అధ్యాపకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లు పని చేస్తుంటారు. ఈ కళాశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థులు ఉపాధి పొందుతుంటే.. వారికి శిక్షణ ఇచ్చే గురువులు మాత్రం మూడు పూట్లా అన్నం తినేందుకే అల్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నారుు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలుండగా ప్రతి చోటా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి.

 

తక్కువ వేతనాలూ ఇవ్వలేరా?

ఒంగోలులో ఉన్న రెండు కళాశాలలకు నాన్‌ప్లాన్ బడ్జెట్ కింద  రెండు నెలలకొకసారి జీతాలు వస్తుంటాయి. అయితే కందుకూరు, మార్కాపురం కళాశాల్లో పని చేసే ఉద్యోగులకు ప్లాన్ బడ్జెట్ కింద మంజూరు అవుతారుు. ప్లాన్ బడ్జెట్ ప్రత్యేకం..  కాంట్రాక్టర్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటాడు. కందుకూరు ఐటీఐ కళాశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు 18 నెలల నుంచి, మార్కాపురం ఐటీఐ కళాశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు 13 నెలల నుంచి జీతాలు అందలేదు. అధ్యాపకులకు రూ. 11500, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 9500, అటెండర్లు, వాచ్‌మెన్‌లకు రూ. 6700 చొప్పున జీతాలు చెల్లించాలి.



ఒక్కొక్క కళాశాలలో ఎనిమిది మంది అధ్యాపకులు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అంటెండర్లు, వాచ్‌మెన్‌లు పని చేస్తున్నారు. వీరందరికీ జీతాలు అందక.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మూగగా రోదిస్తున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేసి చిత్తవుతున్నారు.

 

అందరిలానే విద్యావంతులనూ మోసగించిన బాబు

 వాగ్దానాల నావ ఎక్కి ఒడ్డు చేరుకున్న బాబు.. ఇప్పుడు ఆయన మాటల్ని పూర్తిగా మరిచారు. ఓట్ల కోసం ఆ రోజు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటికీ అతీగతీ లేదు.

 

ఉన్నత డిగ్రీలు ఏం చేయను?

ఐటీఐ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులంతా ఉన్నత చదువులు చదివినవారే. కానీ వీరి ప్రతిభకు.. క్వాలిఫికేషన్‌కు తగిన జీతాలు అందడంలేదు. కేటారుుంచిన తక్కువ జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం అత్యంత దారుణం. ఇటు ఉద్యోగాలు మానేయలేక.. జీతాలు లేక.. కుటుంబాలు గడవక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top