రహదారి నిర్వహణలోనూ నిర్లక్ష్యమే

రహదారి నిర్వహణలోనూ నిర్లక్ష్యమే - Sakshi

  • గోదావరి పుష్కరాల ఆరంభంలో బ్యారేజిపై రోడ్డు నిర్మాణం

  • ఏడాది తిరగకుండానే గోతులు పడిన వైనం

  • గోదారిలో కలిసిన రూ.అరకోటి నిధులు

  • బొబ్బర్లంక (ఆత్రేయపురం) : 

    ధవళేశ్వరం బ్యారేజి నిర్వహణలోనే కాదు.. దీనిపై ఉన్న రోడ్డు నిర్వహణలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం తదితర ప్రాంతాల ప్రజలు రాజమహేంద్రవరం రావాలంటే ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు.

    దెబ్బతిన్నదిలా..

    • ∙ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా నిలుస్తున్న బ్యారేజిపై దెబ్బ తిన్న రహదారిని గత ఏడాది గోదావరి పుష్కరాల ఆరంభంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించారు.

    • ఆ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పటించకపోవడంతో ఏడాది పూర్తి కాకుండానే ఈ రోడ్డు దెబ్బతింది.

    • బ్యారేజి రోడ్డుపై జాయింట్ల వద్ద ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. అక్కడకు చేరేసరికి వాహనాలు ఎగిరి పడుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కూడా పాడవుతున్నాయి.

    • జాయింట్లవద్ద ఖాళీలు ఏర్పడటంతో పాటు అక్కడక్కడ ఇనుప ఊచలు పైకి లేచిపోయాయి.

    • విద్యుద్దీపాలు వెలగక బ్యారేజిపై రాత్రి వేళల్లో అంధకారం అలముకుంటోంది. ఆ సమయంలో వాహనచోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

     

    నాణ్యతతో రోడ్డు నిర్మించాలి

    బ్యారేజిపై రహదారిని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నాణ్యంగా నిర్మించాలి. జాయింట్లవద్ద ఖాళీలు, గోతులు లేకుండా చర్యలు తీసుకోవాలి. బ్యారేజిని కూడా సుందరంగా తీర్చిదిద్దాలి.

    – చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం

     

    నిర్వహణపై శ్రద్ధ చూపాలి

    బ్యారేజి నిర్వహణపై ఇరిగేషన్‌ అధికారులు శ్రద్ధ చూపాలి. కనీసం రక్షిత ప్రాంతంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి ప్రజలు సేద తీరేవిధంగా పార్కులు నిర్మించాలి. బ్యారేజీపై రాత్రి ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి.

    – కప్పల శ్రీధర్, ర్యాలి

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top