ఆక్రమణలో ప్రభుత్వ ఆసుపత్రి స్థలం


► ఎకరా స్థలాన్ని ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించిన ఆక్రమణదారులు

► కళ్ల ముందే కట్టడాలు కడుతుంటే ప్రేక్షక పాత్ర వహించిన వైద్య సిబ్భంది

► సబ్‌సెంటర్‌ను ఆక్రమించుకున్న ఆక్రమణదారులు

 

కొత్తపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కాపాడిల్సిన ప్రజలే వైద్యశాల స్థలాన్ని ఆక్రమించున్నారు. పర్మినెంట్‌ కట్టడాలు నిర్మించుకున్నారు. వచ్చిన డాక్టర్లు పట్టించుకోవపోవడం ఆక్రమణదారులకు అడ్డుఅదుపు లేకుండ పోయింది. ప్రాధమిక స్థాయిలోనే చర్యలు తీసుకొనివుంటే హాస్పిటల్‌ స్థలం ఆక్రమణకు గురయ్యేది కాదని గ్రామస్తులు అంటున్నారు. కొత్తపట్నంలో మండల ఆరోగ్య కేంద్రానికి సర్వేనెంబర్‌ 1391లో రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి కలెక్టర్‌ సునీల్‌శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కొలతలు కొలిచి హద్దు రాళ్లు కూడ వేయటం జరిగింది. కొంత మంది ఆక్రమణదారులు సుమారు ఎకరా స్థలాన్ని ఆక్రమణ చేసుకొని పెద్ద షెడ్డును ఏర్పాటు చేసుకుంటే స్థానిక డాక్టర్లు కనిసం ఆక్రమణదారులకు నోటీసులు కూడ జారీ చేయకపోవటం స్థానికలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంచాయతీ శాఖ అధికారులు ఇంటి పన్నులు కూడ వారికి హక్కు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి రోజు డాక్టర్లు హాస్పిట్‌లకు వస్తుంటారు, వారి కళ్ల ముందే నిర్మిస్తుంటే కనీసం జిల్లా అధికారులకు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించకుండ నిర్లక్ష్యం వ్వహరించారు. అంతేకాక వైద్యశాల ముందు భాగాన్ని ఆక్రమించుకొని ఇనుప తీగతో పెన్సింగ్‌ వేసుకున్నాడాక్టర్లు పట్టించుకోలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పలు సార్లుఈ విషయాన్ని  వైద్య అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోలేదని  గ్రామస్తులు  తెలిపారు.

 

ఆక్రమణలో రెడ్డిపాలెం సబ్‌సెంటర్‌: కొత్తపట్నం రెడ్డిపాలెంలో సబ్‌సెంటర్‌ పూర్తిగా ఆక్రమణకు గురయ్యింది. బిల్డింగ్‌లో కొందరు నివాసం ఉంటున్నారు. వారికి పంచాయతీ అధికారులు గతంలో ఇంటి పన్నులు కూడ ఇచ్చి నివాస హక్కు కల్పించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయమని అడిగితే ఆక్రమణదారులు మాకు హక్కుందని కోర్టులో పిటీషన్‌ వేశారు. ఈ స్థలాన్ని అప్పటిలో ఒక దాత సర్వే నెంబర్‌ 1429బిలో సుమారు 50 గదులు స్థలాన్ని ఉచితంగా సబ్‌సెంటర్‌కు బహుకరించారు. 30 సంవత్సరాలుదాక శిథిలావస్థకు చేరింది. ఇదే అదునుగా ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. జిల్లా అధికారులు స్పందించి మండల ఆరోగ్యకేంద్రం ఆస్తులను స్వాధీనం చేసుకోవలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top