కామధేను కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు

కామధేను కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు - Sakshi

  •  పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ 

  • నెల్లూరు(పొగతోట): కామధేను బ్రీడింగ్‌ కేంద్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి మాట్లాడారు.

     

    చింతలదేవిలో ఏర్పాటు చేస్తున్న నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌లో ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు పూర్తి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందన్నారు. 2400 ఎకరాల్లో కేంద్రం నిధులతో నిర్మిస్తున్న కామధేను సెంటర్‌లో గ్రామీణ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పశువుల దాణాకు, నీటికి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెంటర్‌లో ఉపాధి హామీ పధకం ద్వారా పంటగుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. సెంటర్‌లో దేశవాళీ పశువులను అభివృద్ధి చేయడంతోపాటు రైతుల విజ్ఞానకేంద్రంగా వినియోగించాలన్నారు.

     

    దేశవాళీ పశువుల జాతుల రిసెర్చ్‌ సెంటర్‌గా విస్తృత పరిశోధనలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సెంటర్‌ చుట్టు బయోఫెన్సింగ్‌ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు మాట్లాడుతూ వివిధ శాఖల అ«ధికారులు సెంటర్‌ను స్వయంగా పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లీవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కొండలరావు మాట్లాడుతూ పశువుల దాణాకు ఉపయోగించే వివిధ రకాల వృక్షాలు, గడ్డిజాతులను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌కుమార్, డ్వామా పీడీ హరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top