మాటల యుద్ధం




మనూరు : మనూరులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ముగింపులో మనూరు సర్పంచ్‌ మారుతిరెడ్డి లేచి పట్టపగలు విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఏఈ మాణిక్యం మాట్లాడుతూ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. పంచాయతీ నిధులు వెచ్చిస్తే ప్రత్యేక లైన్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. ‘ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్‌ బిల్లు తీసుకుంటోంది. మీరేం చేస్తున్నారు ’అని సర్పంచ్‌ పేర్కొనడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. విద్యుత్‌ బల్బుల సమస్య నేటిది కాదని గత ప్రభుత్వం నుంచి వస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదనడంతో సర్పంచ్‌ మారుతిరెడ్డి మాట పెంచారు. ఎమ్మెల్యే, సర్పంచ్‌ల మధ్య మాటల యుద్ధ వాడివేడిగా సాగింది.



 బెల్లాపూర్‌ ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ప్రశ్నించకుండా ఇప్పు అగడమేంటని, కాంగ్రెస్‌ హయాంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జెడ్పీటీసీ నిరంజన్, ఎంపీపీ లక్ష్మిగణపతి ఎంత జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు సమావేశ మందిరం వద్దకు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్‌ మారుతిరెడ్డి మాట తీరు సరికాదన్నారు. అనవసరమైన మాటలతో అభివృద్ధిని ఆటంకపర్చరాదని అన్నారు. ఎంపీపీ ఉపాధ్యక్షుడు గడ్డె రమేశ్‌ జోక్యం చేసుకుని కాంగ్రెస్‌ నాయకులను విమర్శించడం సమంజసం కాదన్నారు. ఓ దశలో వ్యక్తిగత విమర్శలకు దారి తీసే పరిస్థితి వచ్చింది. సభలో తీవ్ర గందరగోళం, ఉత్కంట నెలకొంది. ఎంపీపీ జోక్యం చేసుకుని సర్పంచ్‌ను సముదాయిండంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top