అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌

అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌ - Sakshi


భువనగిరి అర్బన్‌ : కొంత కాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పాలకుర్తి యాదగిరి నిందితుడి వివరాలు వెల్లడించారు. మోత్కూర్‌ గ్రామంలోని పోతాయిగడ్డకు చెందిన సిరిగిరి సాయిబాబా అలియస్‌ సాయికుమార్‌ స్టవర్‌ రిపేర్‌ చేస్తానని పట్టణంలో, గ్రామాల్లో తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. గత నెల 31న తుర్కపల్లి గ్రామంలోని గుండెబోయిన కవిత ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టాడు. బంగారు పుస్తెలతాడు, జత చెవి కమ్మలు, జత బంగారు మాటీలు, నాలుగు జతల వెండి పట్టాగోలుసులు, రూ.400 నగదు, మొత్తం నాలుగున్నర తులాల బంగారం, 55 తులాల వెండి ఎత్తుకెళ్లాడు. జనవరి 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణంలోని ప్రగతినగర్‌ కాలనీలో కన్నారపు ప్రసాద్‌ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మన్నా చర్చిలో ప్రార్థనకు వెళ్లారు.



 ఈ సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాను తెరిచి నగల బాక్స్‌లోని నల్లపూసల బంగారు గొలుసు లాకెట్, బంగారు గుండ్ల గొలు సు, లాకెట్‌ చైను, గ్రీన్‌ స్టోన్‌ రింగు, ఒక సెల్‌ఫోన్, ఐ ఫోన్‌ ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులు అనుమానితులను తనిఖీ చేస్తుం డగా పట్టణ శివారులోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద ఒక డేరాలో నివాసముంటున్న సాయిబాబాను విచారించడం తో దొంగతనాలు చేస్తునట్లు ఒప్పుకున్నాడు.సాయిబాబా నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం, చెవి కమ్మలు, మాటీలు, వెండి పట్టాగోలుసులు, సమ్‌సంగ్, ఐ సెల్‌ఫోన్ల, రూ.4వేలు, 3 బైకులను స్వాధీనం చేసుకునట్లు చెప్పారు. సాయిబాబాకు సహకరించిన తండ్రి పరుశారం బంగారు గుండ్ల గొలుసుతో పారిపోయి తప్పించుకుని తిరుగుతున ట్లు తెలిపారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు చె ప్పారు. నిందితుడిని కోర్టుకు రిమాండ్‌ చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ సాధు మోహన్‌రెడ్డి, సీఐ ఎం.శంకర్‌గౌడ్, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ కిరణ్‌ ఉన్నారు.



ఇతర జిల్లాల్లోనూ చోరీలు..

2010 నుంచి ఇప్పటి వరకు మోత్కూర్, నల్లగొండ టౌన్, జనగాం, వరంగల్‌ జిల్లా హుస్నాబాద్, వర్థన్నపేట, వరంగల్‌ మిల్స్‌కాలనీ, మర్రిపెడ బంగ్లా, మహబూబాబాద్, దుగ్గొండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు చెప్పారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు, నల్లగొండ జిల్లా జైలు, జనగాం సబ్‌జైల్లో రి మాండ్‌ ఉన్నట్లు చెప్పారు. 2016 నవంబర్‌లో వరంగ ల్‌ సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి తుర్కపల్లి, భువనగిరిలో 14 దొంగతనాలకు పాల్పడ్డాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top