ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గందరగోళం

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గందరగోళం - Sakshi


భోజనం సరిగాలేదని విద్యార్థుల ఆందోళన

కుంటుపడుతున్న చదువులు..

అధ్యాపకుల ధర్నాకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల మద్దతు

సమస్యను జగన్‌ దృష్టికి  తీసుకెళతాం..




వేంపల్లె :  

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఉన్న మెస్‌లలో నాణ్యమైన భోజనం అందించడంలేదంటూ శుక్రవారం 6 వేల మంది విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.తరగతులను బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. మరోవైపు అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు నాగరాజు మృతిపై అధ్యాపకులు నిరవధికంగా ఆందోళన కొనసాగింది.దీంతో చదువులు కుంటుపడుతున్నాయి.



భోజనం సరిగా లేదు

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో భోజనం సరిగా లేదని విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న మెస్‌లకు ఎదురుగా రోడ్డుపై బైటాయించారు. అక్కడ మెస్‌ నిర్వాహకులు తమకు నాణ్యమైన భోజనం అందించడంలేదు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు.  ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో కేఎంకె, ఫైన్, శక్తి సంస్థలు విద్యార్థులకు మెస్‌ల ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందులో 6 ఏళ్ల విద్యార్థులు దాదాపు 6 వేలమంది భోజనం చేస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి భోజనం వడ్డిస్తున్నారన్న విద్యార్థులనుండి ఆరోపణలు వచ్చాయి.  



నాగరాజుపై కొనసాగిస్తున్న అధ్యాపకుల ఆందోళన :

ట్రిపుల్‌ ఐటీలో మెకానికల్‌ విభాగంలో తాత్కాలిక అధ్యాపకునిగా పనిచేస్తున్న నాగరాజు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న  అధ్యాపకులు మంగళవారం నుంచి ఆందోళన చేపట్టారు.శుక్రవారం నాగరాజు చిత్రపటానికి పూలమాలవేసి రోడ్డుపై బైఠాయించారు. ట్రిపుల్‌ ఐటీల సమస్యలను



జగన్‌ దృష్టికి తీసుకెళతాం.. :

ట్రిపుల్‌ ఐటీలో ఉన్న అన్ని సమస్యలను ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి అధ్యాపకులకు తెలియజేశారు.  నాగరాజు మృతిపై విచారణ జరిపించాలని ఆందోళన చేస్తున్న అధ్యాపకులకు  వారు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రిపుల్‌ ఐటీలో ఉన్న సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎ స్‌ అవినాష్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  విద్యార్థులతో డైరెక్టర్‌ భగవన్నారాయణ, ఏఓ అమరేంద్రకుమార్‌ చర్చలు జరిపారు.  ఇక్కడ ఉన్న మెస్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించా రు. ఈ నెల 23వ తేదీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామనిడైరెక్టర్‌ విద్యార్థులకు తెలిపారు.



వీసీ రాకతో ఆందోళన విరమించేనా..

ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య రామచంద్రరాజు శనివారం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి రానున్నారు. ఆయన రాకతో అధ్యాపకులు చేపడుతున్న ఆందోళన విరమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాగరాజు మృతిపై కలెక్టర్‌తో కమిటీ వేసి విచారణ జరిపించాలని అధ్యాపకుడు నాగరాజు భార్య పావనికి అర్హతను బట్టి ఉద్యోగం, రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో తోటి అధ్యాపకులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top