ఐబీ సర్కిల్‌ భవనాన్ని మినహాయించాలి


  • నూతన కలెక్టరేట్‌ కోసం ఖాళీ చేయాలని ఆదేశాలు

  • సరిపోని డీఎంసీ భవనం

  • ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగుల వేడుకోలు

  • వరంగల్‌ : ఐబీ సర్కిల్‌ కార్యాలయాన్ని ప్రస్తుత భవనంలోనే కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త కలెక్టరేట్‌ ఏర్పాటుకు ఐబీ సర్కిల్‌ కార్యాలయం ఖాళీ చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ కరుణ ఆదేశించిన విషయం తెలిసిందే. సర్కిల్‌ కార్యాలయం వెనుకన్ను డీఎంసీ భవనంలోకి మార్చుకోవాలని సూచించారు. దీంతో సర్కిల్‌ కార్యాలయంలోని ఉద్యోగులు ఫైళ్లు, సామగ్రిని తరలించే పనిలో ఉన్నారు. అయితే డీఎంసీలోని గదులు సరిపోని పరిస్థితులు ఉ న్నాయి. సర్కిల్‌ కార్యాలయంలో 10,800 అడుగుల స్థలం ఉండగా, డీఎంసీ భవనంలో 2,620 అడుగుల స్థలం మాత్రమే ఉంది. ఇంత తక్కువ స్థలంలో సర్కిల్‌ కార్యాలయంలోని సామగ్రిని, ఫైళ్లను ఎక్కడ పెట్టాలో... ఇందులోని 60మంది ఉద్యోగులు ఎక్కడ విధులు నిర్వర్తించాలో.. తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సర్కిల్‌ కార్యాలయ భవనాన్ని అదే భవనంలోనే కొనసాగించాలని వేడుకుంటున్నారు. ఈభవనంలో 1946నుంచి చెరువులు, భూములు, అయకట్టుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. ఐబీ సర్కిల్‌ కార్యాలయంలో సామగ్రిని తరలిస్తే ఎక్కడ భద్రపరచాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కారుణ్య నియామకాలతో ఇక్కడు మూడు తరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కా ర్యాలయం తరలించకుండా కలెక్టర్‌ మినహా యింపు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. కలెక్టర్‌ భవనం ఖాళీ చేయాలని ఆదేశాలతో ఇరిగేష¯ŒS ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలయజేస్తూ లేఖ రాయగా ఎలాంటి స్పందన రాలేదు. ఉద్యోగుల వినతిని పరిగణలోకి తీసుకుంటే ముందుగా నిర్ణయించిన విధంగా డీఆర్‌డీఏ భవనంలో మరో కలెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top