జిల్లా మంత్రులతో నాకు పనేంటి?

ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు


మచిలీపట్నం : పెడన నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడే స్వయంగా సహకరిస్తున్నారు అలాంటప్పుడు జిల్లా మంత్రులతో నాకు పనేముందని ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం  సబ్‌స్టేషన్‌లో ప్రారంభ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు.


సీనియర్ శాసనసభ్యుడిగా నేరుగా సీఎంతో సంబంధాలున్నాయని నా సమస్యలపై నేరుగా ఆయనకే విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నానన్నారు. సమస్యల ప్రాముఖ్యత ఆయనకు తెలుసునని విద్యుతు సమస్యకు నిధులు కేటాయించారన్నారు. అనేక సమస్యలపై జిల్లా మంత్రులకు విజ్ఞాపనలు ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉందే తప్ప జరిగిందేమీ లేదన్నారు.


సమస్యలపై సీఎం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారన్నారు. కరవు మండలాలుగా ప్రకటించారన్నారు. నా ఎదుగుదలకు నా పదవులకు ఎవరు అడ్డంకి కాదన్నారు. అవకాశం ఉంటే పదవి ఎదురు వస్తుందన్నారు. పదవి కన్నా ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాటాల నరసింహస్వామి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top