వినియోగదారులపై భారం సరికాదు


జీఎస్‌టీ వ్యాట్‌ట్యాక్స్‌ తగ్గించాలి

హోటల్స్‌ అసోసియేషన్‌ సభ్యుల డిమాండ్‌

పట్టణంలో ర్యాలీ.. నిరసన




మహబూబ్‌నగర్‌ క్రైం: కేంద్ర ప్రభుత్వం హోటళ్లలో వ్యాట్‌ట్యాక్స్‌ను పెంచడం వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటుందని, వెంటనే ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం చేపట్టిన హోటళ్ల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అవంతి హోటల్‌ దగ్గరనుంచి న్యూటౌన్, బస్టాండ్, క్లాక్‌టవర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు మనోహార్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్‌టీ చట్టంలో వినియోగదారులైన సామాన్య ప్రజలపై అధిక భారం పడేవిధంగా 18శాతం వ్యాట్‌ట్యాక్స్‌ వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.



ఈనెల 30న జిల్లాలో హోటళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్‌టీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి సామాన్యులపై భారం పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హోటల్‌ వ్యాపారం అశించిన స్థాయిలో లేదని, ఈ క్రమంలో పన్నుభారం అధికంగా ఉంటే హోటల్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, సమత్‌ఖాన్, చంద్రశేఖర్‌శెట్టి, శ్రీకాంత్‌రెడ్డి, జీతేందర్‌రెడ్డి, ఉమమహేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి,నాగరాజు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top