మానవ రవాణ నియంత్రణకు కృషి చేయాలి

judge

ఒంగోలు సెంట్రల్‌ : మానవ రవాణ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కేవీ విజయకుమార్‌ అన్నారు. ప్రపంచ మానవ రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పలువురు న్యాయమూర్తులతో శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. మానవ రవాణాపై సాధారణ ప్రజలు, పాలసీ తయారీదారులు, పౌర సమాజాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా జడ్జి చెప్పారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శనివారం ఉదయం చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌కే మహ్మద్‌ ఇస్మాయిల్, ఫ్యామిలీ కోర్టు జడ్జి వి.మోహన్‌కుమార్, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి వై.హేమలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.రాజా వెంకటాద్రి, పీడీఎం జడ్జి లక్ష్మీకుమారి, జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.శ్రావణ్‌కుమార్, దుర్గాకళ్యాణి, హెల్ప్‌ కో ఆర్డినేటర్‌ కిషోర్, చైల్డ్‌ వెల్‌ఫేర్‌ కమిటీ సభ్యులు బెంజిమెన్‌ పాల్గొన్నారు.

చీరాల :

మానవ రవాణ నియంత్రణ అందరి బాధ్యతని చీరాల డీఎస్పీ డాక్టర్‌ జి.ప్రేమ్‌కాజల్‌ అన్నారు. ప్రపంచ మానవ రవాణ నిర్మూలన దినోత్సవం సందర్భంగా హెల్ప్, ఫారమ్‌ ఫర్‌ చైల్డ్‌రైట్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వేస్టేçÙన్‌లో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చైల్డ్‌లైన్‌ ప్రతినిధి బీవీ సాగర్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా అనేక మంది బాలికలు, యువతులను ప్రేమ, ఉద్యోగాల పేరుతో వివిధ రాష్ట్రాలు, దేశాలకు వ్యభిచారం వృత్తికి తరలిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కొంతమంది అనారోగ్యానికి గురై అక్కడే ప్రాణాలు వదులుతున్నారన్నారు. మానవ రవాణను నిర్మూలించేందుకు చట్టాలు తయారు చేసి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో చీరాల ఒన్‌టౌన్‌ సీఐ ఎన్‌.సత్యనారాయణ, సీడీపీఓ నాగమణి, జీఆర్పీ ఎస్సై రామిరెడ్డి, ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పి.శంకరరావు పాల్గొన్నారు.

 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top