దొంగ అనుకుని...

దొంగ అనుకుని...


చితకబాదారు

పోలీసుల అతి ప్రచారంతో ఆస్పత్రిపాలైన గిరిజనుడు




గీసుకొండ(పరకాల): దొంగ అనే అనుమానంతో ఓ గిరిజనుడిని చితక బాదిన సంఘటన  గ్రేటర్‌ వరంగల్‌ నగరం మూడో డివిజన్‌ ధర్మారంలో ఆదివారం రాత్రి జరిగింది. తీవ్ర గాయలైన అతడిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీ ఎం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం... మండలంలో దొంగలు సంచరిస్తున్నారని, కారంపొడి, కర్రలు పట్టుకుని గస్తీ నిర్వహించాలని  పోలీసులు ప్రచారం చేస్తున్నారు. దీంతో స్థానికులు కర్రలో, కారంపొడితో వారం రోజులుగా రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేటకు చెందిన ఓ గిరిజనుడు ఆంగోతు బాషా(సరిగా పేరు తెలియదు) గుండు గీయించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉండటంతో అనుమాస్పం దంగా కనిపించాడని గ్రామస్తులు అతడిని కట్టేసి చితక బాది గీసుకొండ పోలీçసులకు సమాచారం అందించారు.



వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తి గురించి ఆరా తీయ గా దొంగ కాదని వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పోలీసులకు ఫోన్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే అతడి ని స్థానికులు చితకబాదడంతో తీవ్ర గాయాలు కాగా వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. బాధి తుడి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నం టాయి. ఈ విషయమై గీసుకొండ సీఐని వివరణ కోరడానికి పలుమార్లు ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు. పోలీసుల అతి ప్రచారం బెడిసి కొట్డింది. అమాయకుడైన గిరిజనుడు తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చేరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top